Samyuktha : సంయుక్త మీనన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన “భీమ్లానాయక్” తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మూవీ మంచి హిట్ సాధించడంతో ఆమెకు అటు తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు వచ్చాయి. 2016లో పాప్ కార్న్ అనే తమిళ చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ఆరంభించింది ఈ భామ. ఇక ఇటీవలే నందమూరి కళ్యాణ్ రామ్ సరసన బింబిసారా, తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా చేసిన సార్ మూవీ లతో మంచి సక్సెస్ లను అందుకుంది. దీంతో హ్యాట్రిక్ హిట్ లను అందుకున్న ఈ భామ మంచి జోష్ లో ఉంది. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేసిన “విరూపాక్ష” కూడా హిట్ టాక్ తెచ్చుకోవడంతో గోల్డెన్ లెగ్ బ్యూటీ అని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో డెవిల్ సినిమాలో చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా తన లేటెస్ట్ ఫోర్వస్ తో ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది.