Neha Shetty : “నేహా శెట్టి”.. తెలుగు కుర్రకారులకు పరిచయం అక్కర్లేని పేరు..మెహబూబా చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. గల్లీ రౌడీ చిత్రంలో సందీప్ కిషన్ కి జోడి గా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో కూడా మెరిసింది. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అయిన డీజే టిల్లు చిత్రంతో ఈ అమ్మడి క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఇక ప్రస్తుతం యంగ్ హీరోలతో బెదురులంక, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, రూల్స్ రంజన్ సినిమాల్లో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుని ఆకట్టుకుంటుంది.