Zomato: దేశ వ్యాప్తంగా చిన్న నగరాల్లో తమ సేవలను నిలిపి వేయనున్నట్టు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. దాదాపు 225 చిన్న నగరాల్లో జొమాటో సేవలు ఆపివేస్తున్నట్టు సంస్థ పేర్కొంది. ఆయా నగరాల్లో గ్రాస్ ఆర్డర్ విలువ 0.3 శాతం ఉన్న కారణంగా సేవలు నిలిపి వేస్తున్నట్టు పేర్కొంది. కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో(Zomato)
ప్రస్తుతం ఫుడ్ డెలివరీ మార్కెట్ లో నెలకొన్న మందగమనం ఊహించలేదని.. గత కొన్ని నెలలుగా 225 ట్టణాల్లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీకి ప్రజల నుంచి స్పందన, ప్రోత్సాహం పెద్దగా లేని నేపథ్యంలో
ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కంపెనీ తెలిపింది. ఇది వ్యాపార వృద్దిపై అంతగా ప్రభావం చూపదు..
కానీ కంపెనీ నిర్దేశించుకున్న భవిష్యత్ లక్ష్యాలను అందుకోవడం ఎంతో ముఖ్యమని, అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని జొమాటో వెల్లడించింది. అయితే సేవలు ఏయో నగరాల్లో ఆపుతున్నారో వెల్లడించాల్సి ఉంది.
గత త్రైమాసికంలో 346.6 కోట్ల నష్టాలు
ఈ క్రమంలో అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో జొమాటో రూ. 346.6 కోట్లు నష్టాలను నమోదు చేసింది. దీనికి ప్రధాన కారణం గత అక్టోబర్ నుంచి ఫుడ్ డెలివరీ రంగం మందకొడిగా సాగుతోంది.
ఈ ప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ, ముఖ్యంగా 8 నగరాల్లో ఇది ఎక్కువగా ఉందని జొమాటో పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయంతో టెక్ సంస్థలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నా.. తాము మాత్రం ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపింది.
వివిధ రంగాల్లో 800 మందిని నియమించుకుంటామన్నారు. అయితే ఈ నిర్ణయంపై పలు విమర్శలు వచ్చాయి.
గత ఏడాది చివర్లో పనితీరు ఆధారంగా 3 శాతం సిబ్బందిని తొలగాంచారని .. ఇప్పుడు మళ్లీ నియామకాలు చేపట్టడం అంతా గిమ్మిక్కులు అని పలువురు వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో 225 నగరాల్లో సేవలు నిలిపి వేస్తే మరింత మంది ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం అవుతోంది.