conman Kiran Bhai Patel:పీఎంఓ కార్యాలయం సీనియర్ అధికారినంటూ జమ్ము కశ్మీర్ ప్రభుత్వ అధికారులకు టోకరా వేశాడు గుజరాత్‌కు చెందిన ఓ మోసగాడు. తనకు తాను ప్రధాన మంత్రి కార్యాలయంలో సీనియర్ అధికారినంటూ జెడ్ ఫ్లస్ సెక్యురిటీ తో పాటు బుల్లెట్ ఫ్రూప్ మహీంద్రా స్కార్పియోలో తిరుగుతూ.. ఫైవ్ స్టార్ హోటల్‌లో బసతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని వసలుతు అనుభవించాడు.
కాగా మోసగాడి పేరు కిరణ్ బాయి పటేల్.. ఈ ఏడాది ప్రారంభంలో రెండు సార్లు శ్రీనగర్ పర్యటనకు వచ్చాడు. పలుమార్లు సీనియర్ అధికారులతో సమావేశం కూడా అయ్యాడు. పటేల్ తనకు తాను ప్రధానమంత్రి కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ ఫర్ స్ర్టాటజీ అండ్ క్యాంపెన్‌గా చెప్పుకొచ్చాడు. కాగా కేటుగాడిని పది రోజుల క్రితమే అరెస్టు చేశారు. అయితే అధికారులు మాత్రం పటేల్ అరెస్టును గోప్యంగా ఉంచారు. గత గురువారం నాడు ఆయనను జ్యూడిషియల్ కస్టడీకి పంపిన తర్వాత మాత్రమే కిరణ్ బాయి పటేల్ లీలలు బయటకు వచ్చాయి. అయితే ఆయనపై ఎఫ్‌ఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ చేసింది ఇతమిద్దంగా తెలియదు.
సెక్యూరిటీతో కశ్మీర్ పర్యటన..(conman Kiran Bhai Patel)
కాగా ఈ మోసగాడు గత నెలలో కశ్మీర్‌లో వచ్చి ఇక్కడి హెల్త్ రిసార్ట్‌ను సందర్శించారు. కశ్మీర్‌లో ఆయన పలు ప్రాంతాలకు పారామిలిటరీ దళాలతో వెళ్లిన వీడియోలు అందుబాటులోకి వచ్చాయి. మంచుతో కప్పబడిన బుడ్గమ్ ప్రాంతాన్ని పారామిలిటరీ గార్డ్స్‌లో కలిసి వెళ్లిన వీడియోలతో పాటు శ్రీనగర్‌లోని లాల్ చౌక్ టవర్ వద్ద ఫోటోలు తీసుకున్న వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఉన్నత విద్యావంతుడు..
అయితే కిరణ్ బాయి పటేల్ అల్లాటప్ప కేటుగాడు మాత్రం కాదు. అతను ఉన్నతవిద్యావంతుడు. ఆయన ట్విట్టర్ ఖాతాను చూస్తే వర్జినీయిలోని కామిన్‌వెల్త్ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ చేశారు. ఐఐఎం తిరుచ్చి నుంచి ఎంబీఏ , ఎం.టెక్ కంప్యూటర్ సైన్సెస్, బీఈ, కంప్యూటర్ ఇంజినీరింగ్ చేసినట్లు తెలుస్తోంది.అతని భార్య మాలినీ పటేల్ ప్రకారం, కిరణ్ భాయ్ పటేల్ ఇంజనీర్. “నా భర్త ఇంజనీర్ మరియు మరేమీ కాదు కాబట్టి అభివృద్ధి పనుల కోసం అక్కడికి (J&K) వెళ్ళాడు. తాను ఏ తప్పూ చేయలేదు. అక్కడి మా న్యాయవాది ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు. నా భర్త ఎప్పుడూ తప్పు చేయడు” అని మాలిని అన్నారు.