Site icon Prime9

World Space Week: ఘనంగా ప్రారంభమైన ప్రపంచ అంతరిక్ష్య వారోత్సవాలు

World Space Week started on a grand not

World Space Week started on a grand not

Sriharikota: దేశ వ్యాప్తంగా నేటి నుండి 7రోజుల పాటు చేపట్టనున్న ప్రపంచ అంతరిక్ష్య వారోత్సవాలను తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ప్రారంభించారు. శ్రీహరికోటకు చేరుకొన్న గవర్నర్ తొలుత షార్ లోని మిషన్ కంట్రోల్ సెంటర్, రెండు లాంచ్ ప్యాడ్ లను సందర్శించారు. అనంతరం డాక్టర్ ఎంఆర్ కురూప్ ఆడిటోరియంలో నిర్వహించిన వారోత్సవాల్లో గవర్నర్ పాల్గొన్నారు. జ్యోతిని వెలిగించి వారోత్సవాల విశిష్టతను తెలియచేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ రవి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో దేశం సాంకేతికంగా వెనుకబడి వుందన్నారు. విక్రమ సారాభాయ్ వంటి మేధావులు అంతరిక్ష ప్రయోగాలకు బీజం వేశారన్నారు. నేడు మారుమూల గ్రామాల్లో సైతం అభివృద్ది సాగుతుంది అంటే మన శాస్త్రవేత్తలు మనకిచ్చిన సాంకేతికతోనే సాధ్యమైందన్నారు. టెలివిజన్, మొబైల్ సేవల్లో దేశం ఎంతో ముందుందన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రరాజ్యాలకు ధీటుగా ఇస్రో పోటీ పడుతుండడం మన శాస్త్రవేత్తల మేధస్సుకు ఓ గీటురాయన్నారు. రష్యా వంటి దేశాలపై నాడు ఆధారపడ్డామని, నేడు ఆ పరిస్ధితి లేదని గవర్నర్ ఆనందం వ్యక్తం చేశారు.

ఏటా ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో అంతరిక్ష్య వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 10వరకు ఈ వేడుకలు జరుపుకొంటుంటారు. భూభాగం నుండి ప్రయోగించిన తొలి ఉపగ్రహం స్పుత్నిక్ ఆ ప్రయోగాన్ని 1951, అక్టోబర్ 4న చేపట్టివున్నారు. అదే విధంగా శాంతియుత ప్రయోజనాలతోపాటు సాంకేతికత అభివృద్దికి మాత్రమే ఉపగ్రహ ప్రయోగాలుగా చేపట్టాలంటూ 1967, అక్టోబర్ 10న పలు దేశాల మద్య ఒప్పందాలు చేసుకొన్నారు. ప్రతి ఏటా ఒక నినాదంతో వారోత్సవాలు చేపడుతుంటారు. ఈ ఏడాది కూడా స్పేస్ అండ్ సస్టైయినబిలిటీ థీమ్ ని ఎంచుకొన్నారు.

ఈ నేపథ్యంలో మానవాళికి ఉపయెగపడే సాంకేతిక అవసరాలను ప్రజలకు తెలియచేయడం, తద్వార శాస్త్రవేత్తలగా తీర్చిదిద్దేందులో విద్యార్ధి దశ నుండే వారిలోని సృజనాత్మకాన్ని వెలికితీయడమే వారోత్సవాల ప్రధాన ఉద్ధేశం. శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో 4 రాష్ట్రాల్లో వివిధ సభలు, విద్యార్ధులకు పోటీలను ఇస్రోలోని పలు కీలక విభాగాల అధికారులు నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Ashwini Vaishnav :దేశవ్యాప్తంగా 200 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

Exit mobile version