Woman Slaps MLA: ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన మహిళ.. ఎందుకంటే..?

Woman Slaps MLA: ఉత్తరభారతాన్ని వరదలు వణికిస్తోన్న వేళ హర్యానా రాష్ట్రంలో ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది అని తెలుసుకునేలోపే ఎమ్మెల్యే చెంప పగిలింది. ఈ ఊహించని ఘనటతో పాపం ఆ ఎమ్మెల్యే బిత్తరపోయాడు.

Woman Slaps MLA: ఉత్తరభారతాన్ని వరదలు వణికిస్తోన్న వేళ హర్యానా రాష్ట్రంలో ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది అని తెలుసుకునేలోపే ఎమ్మెల్యే చెంప పగిలింది. ఈ ఊహించని ఘనటతో పాపం ఆ ఎమ్మెల్యే బిత్తరపోయాడు. తేరుకుని అక్కడే ఉన్న స్థానికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అసలు ఎందుకు ఎమ్మెల్యేను చెంప చెళ్లు మనించిందీ అంటే.. ఇటీవల గత కొద్ది రోజులుగా హర్యానాలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవన అస్తవ్యస్థమంగా మారిపోయింది. వర్షాలు, వరదలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈక్రమంలోనే వరదలతో సతమతమవుతున్న ప్రజల్లో ప్రభుత్వంపై స్థానిక ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఓట్ల కోసం ఇళ్లిల్లూ తిరుగుతూ దండాలు పెడుతూవస్తారు కానీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రం కానరారు. వరదలతో ప్రజలు కష్టాలు పడుతుంటే ఏ ఒక్క ప్రజా ప్రతినిధి తమను పట్టించుకోవడానికి రాలేదను వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

చెంప పగలగొట్టినా చలించని ఎమ్మెల్యే(Woman Slaps MLA)

ఇక ఈ నేపథ్యంలో జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌ తన నియోకవర్గంలోని వరదబాధిత ప్రాంతాన్ని పరిశీలించటానికి వెళ్లారు. కాగా అతనిని చూసిన ఓ మహిళ కోపంతో ఊగిపోయింది. ఇన్ని రోజులుగా మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో తెలియదా.. మేం తిండీ తిప్పలు లేకుండా చిన్నపిల్లలతో సహా నానా కష్టాలు పడుతుంటే ఇప్పుడా వచ్చేది అంటూ సదరు ఎమ్మెల్యేని నిలదీస్తూ ఆవేశంలో ఆయన చెంప ఛెళ్లుమనింపించింది. ఈ ఊహించని ఘటనతో ఎమ్మెల్యే బిత్తరపోయాడు. ఆ తర్వాత వెంటనే తేరుకుని స్థానికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. అక్కడే ఉన్నవారంతా ఆశ్చర్యంతో చూస్తుంటే ఆ ఎమ్మెల్యే మాత్రం శాంతంగా.. పోనీలే పాపం వారు కష్టాల్లో ఉన్నారు కదా.. ఆ మాత్రం కోపం ఉంటుందిలే.. నా చెంపమీద కొట్టిన ఆ మహిళను క్షమించేశాను అంటూ చెప్పుకొచ్చారు. కాగా దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హర్యానాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఘగ్గర్ నదిపై ఉన్న చిన్న డ్యామ్‌ పై పడిపోయింది. దానితో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఘలా ప్రాంతాన్ని వరదనీరు ముంచెత్తింది. పరిస్థితిని సమీక్షించేందుకు ఆ ప్రాంత ఎమ్మెల్యే బుధవారం (జులై 12, 2023) అక్కడ పర్యటించారు. దీనితో స్థానికులంతా ఆయన్ని చుట్టుముట్టారు. సరైన చర్యలు తీసుకోకపోవటం వల్లే ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చిందంటూ స్థానికుల ఎమ్మెల్యేపై మండిపడ్డారు. అయితే అదే జనంలోని ఓ మహిళ అకస్మాత్తుగా ముందుకు దూసుకొచ్చి.. ఎమ్మెల్యేను ‘ఇప్పుడెందుకు వచ్చావ్..?’ అని ఆగ్రహం వ్యక్తంచేస్తూ చెంప ఛెళ్లుమనిపించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యే చుట్టూ రక్షణగా నిలిచారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ మాట్లాడుతూ..‘‘అది ఓ ప్రకృతి విపత్తని నచ్చజెప్పేందుకు నేను ప్రయత్నించానని కానీ వర్షాలు భారీగా కురుస్తుండంతో వెంటనే చర్యలు తీసుకోలేకపోయామని చెప్పేందుకు యత్నించినా వినలేదు..  స్థానికులు వినే పరిస్థితిలో లేరు.. తనను కొట్టిన ఆమెను క్షమించాను.. ఎటువంటి న్యాయపరమైన చర్యలు ఆమెపై తీసుకోను’ అని తెలిపారు.