Bengaluru Woman:బెంగళూరులో షాకింగ్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది, 39 ఏళ్ల మహిళ తన తల్లిని హత్య చేసి సూట్‌కేస్‌లో కుక్కి మృతదేహంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలేకహళ్లి ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సేనాలి సేన్ అనే నిందితురాలు ఆవేశంతో తన 70 ఏళ్ల తల్లి బీవా పాల్‌ను హత్య చేసింది.
తల్లీకూతుళ్లకు తరచూ గొడవలు..(Bengaluru Woman)
సేనాలీకి తన తల్లితో తరచూ గొడవలు జరిగేవని ప్రాథమిక విచారణలో తేలింది. ఈసారి గొడవ జరుగుతున్న సమయంలో ఆమె తల్లి నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆగ్రహానికి గురైన సోనాలి తన తల్లికి 20 నిద్రమాత్రలు తినిపించింది.కొంతసేపటికి కడుపునొప్పి రావడంతో తల్లి కేకలు వేయడంతో ఆగ్రహించిన సేనాలీ తల్లి గొంతుకోసి హత్య చేసింది. సేనాలీని అరెస్టు చేసిన పోలీసులు ఈ విషయాన్ని మరింత లోతుగా విచారిస్తున్నారు.నిందితురాలు వివాహిత అని, నేరం జరిగిన సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు.మహిళ అత్త ఇంట్లో ఉన్నారని, అయితే గదిలో హత్య జరిగినట్లు ఆమెకు తెలియదని వారు తెలిపారు.