Amritpal Singh case:ఖలిస్తానీ నాయకుడు మరియు వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు చేపట్టిన వేట నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వంపై పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలక ఆమ్ ఆద్మీ పార్టీ 80,000 మంది పోలీసులను కలిగి ఉందని అయితే ఇప్పటివరకు సింగ్‌ను అరెస్టు చేయలేకపోయారని తప్పుబట్టింది. శనివారం ప్రారంభించిన ఆపరేషన్ స్టేటస్ రిపోర్టును కూడా కోర్టు కోరింది.
అమృత్ పాల్ మినహా అందరినీ ఎలా అరెస్టు చేశారు ? ..( Amritpal Singh case)
మీ వద్ద 80,000 మంది పోలీసులు ఉన్నారు. వాళ్ళు ఏమి చేస్తున్నారు. అమృతపాల్ సింగ్ ఎలా తప్పించుకున్నాడు? పంజాబ్ ప్రభుత్వం అమృత్ పాల్ సింగ్మ పై కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపిన తర్వాత ఆగ్రహం చెందిన కోర్టు పేర్కొంది.వారిస్ పంజాబ్ దే న్యాయ సలహాదారు ఇమాన్ సింగ్ ఖారా హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు మరియు సింగ్ నిజానికి పోలీసుల ‘అక్రమ కస్టడీ’లో ఉన్నట్లు ఆరోపించాడు.అమృత్‌సర్‌లో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశానికి ‘చక్కటి ప్రణాళికతో కూడిన ఆపరేషన్’ మరియు అదనపు భద్రతను మోహరించినప్పటికీ, సింగ్ ఎలా తప్పించుకోగలిగాడో చెప్పాలని హైకోర్టు డిమాండ్ చేసింది.ఎన్‌ఎస్‌ఏ ఎందుకు విధించారు? మొత్తం ఆపరేషన్ ‘ప్లాన్‌డ్’.. అలాంటప్పుడు అమృతపాల్ మినహా అందరినీ ఎలా అరెస్టు చేశారు? మేము కథనాన్ని నమ్మలేకపోతున్నాము అని కోర్టు పేర్కొంది.
పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ సింగ్ కోసం గాలింపులో భాగంగా 100 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేశారు అతని అనేక వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అతని స్వగ్రామంలో భద్రతా సిబ్బందిని మోహరించారు.మరోవైపు రాష్ట్రంలో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు.దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తులను మేము విడిచిపెట్టము. ఈ రాష్ట్ర ప్రజలు శాంతి మరియు పురోగతిని కోరుకుంటున్నారని మాన్ అన్నారు.
అమృత్ పాల్ సింగ్ గత కొన్ని సంవత్సరాలుగా పంజాబ్‌లో చురుకుగా ఉన్నాడు. తరచూ సాయుధ మద్దతుదారులతో సంచరిస్తాడు.అతను ఖలిస్తానీ వేర్పాటువాది మరియు టెర్రరిస్ట్ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే అనుచరుడిగా తనను పేర్కొన్నాడు. అతని మద్దతుదారులు అతడిని భింద్రన్‌వాలే 2.0 అని పిలుస్తారు.