Sonia Gandhi on Exit Polls: ఎగ్జిట్ పోల్స్‌ను ఇండియా కూటమి తేలికగా కొట్టిపారేసింది. 2024 లోకసభ ఎన్నికలల్లో ప్రస్తుతం వస్తున్న ఎగ్జిట్‌పోల్స్‌కు పూర్తిగా వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయని ప్రతిపక్ష పార్టీ భావిస్తోంది. కాగా దేశంలోని పలు చానల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్నీ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ఘనవిజయం సాధిస్తుందని అంచనా వేశాయి.
కాగా కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీని మంగళవారం నాడు వెలువడనే ఎన్నికల ఫలితాలపై స్పందించాలని కోరగా.. వేచి చూడండి.. తమ అంచనా ప్రకారం ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఫలితాలు రాబోతున్నాయన్నారు.ఇదిలా ఉండగా సోనియాగా న్యూఢిల్లీలోని డీఎంకె కార్యాలయానికి విచ్చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి 100వ జయంతి ఉత్సావాల్లో ఆమె పాల్గొన్నారు. ఆమెతో పాటు ఇండియా కూటమికి చెందిన ఇతర పార్టీల నాయకులు సీతారామ్ ఏచూరి, సమాజ్‌వాది పార్టీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్‌లు కూడా హాజరయ్యారు. అలాగే సీనియర్ నాయకులు టీఆర్ బాలు, తిరుచి శివలు కూడా వారు వెంట వచ్చారు. కాగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా డీఎంకె కార్యాయలయానికి వెళ్లి కరుణానిధికి నివాళులర్పించారు.
కరుణానిధి 100వ జయంతిని తన మిత్రులతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు సోనియాగాంధీ. కరుణానిధితో పలు సందర్బాల్లో పలు మార్లు సమావేశమైనందుకు సంతోషంగా ఉందన్నారు. కరుణా నిధి సలహాలు, సూచనల వల్ల లబ్ధిపొందామన్నారు. ఆయనతో సమావేశం కావడం అదృష్టమన్నారు. కరుణానిధి 100వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న మిత్రులకు అందిరికి శుభాకాంక్షలు అని ఆమె అన్నారు.
ఇదిలా ఉండగా ఏడవ విడత లోకసభ ఎన్నికలు శనివారంతో ముగిశాయి. మంగళవారం నాడు కౌంటింగ్ మొదలుకానుంది. కాగా ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి రానుంది. కాగా ఇండియా కూటమి మాత్రం తాము 295 సీట్లు గెలువబోతున్నామని.. కేంద్రంప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ధీమాతో ఉన్నారు.