Sukesh Chandrasekhar Letter : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీశ్ సిసోడియాకు జైల్లో వివిఐపి ట్రీట్‌మెంట్ అందుతోందనిసుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ లెఫ్టినెంట్-గవర్నర్ (ఎల్-జీ) వీకే సక్సేనాకు లేఖ రాశారు. జైలులో సిసోడియాకు వీవీఐపీ ట్రీట్‌మెంట్‌పై విచారణ జరిపించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు.
మనీశ్ సిసోడియా జైలు-1లోని వార్డ్ నెం. 9లో ఉన్నారు, ఇది తీహార్ జైలు మొత్తానికి వీవీఐపీ వార్డ్. ఇది ఉన్నత స్థాయి వీఐపీ ఖైదీల కోసం ఒక ప్రత్యేక వార్డు అని అతను తరువాతి కాలంలో పేర్కొన్నాడు.ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్కడ కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌లు ఉన్నారని సిసోడియా భద్రత గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కూడా సుకేష్ ఆరోపించారు. ఇవన్నీ అబద్దాలని వాస్తవ వ్యతిరేక కధనాలని అన్నారు. దీనిలో మీడియాను కూడా భాగం చేసి వాస్తవాలు తెలియజేమని సుకేష్ కోరారు.
వివివిఐపి వార్డులో సిసోడియాను బాగా చూసుకుంటున్నారు. ఈ ఆరోపణలన్నీ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ మరియు జైలు పరిపాలన యంత్రాంగం ద్వారా ప్లాన్ చేయబడ్డాయి. వీటిని ఒక పధకం ప్రకారం ప్రచారంలోకి తీసుకు వస్తున్నారుసత్యేందర్ జైన్ ఇప్పటికీ జైలు సిబ్బందిని నియంత్రిస్తున్నారు. జైలు పరిపాలన పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో “తోలుబొమ్మల” మాదిరి ఆడుతోందని సుకేష్ తన లేఖలో ఆరోపించారు.ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిసోడియాను గురువారం నాడు మళ్లీ అరెస్టు చేసింది. అతను ఇప్పటికే మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు. ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ సిసోడియాను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు రద్దు చేసిన మద్యం పాలసీకి సంబంధించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంను ఈడీ గురువారం 6 గంటలకు పైగా ప్రశ్నించింది.
మనీష్ సిసోడియా తీహార్ జైలు నుండి ఒక సందేశాన్ని పంపారు, జైలు శిక్ష తనకు కష్టాలను కలిగిస్తుంది, అయితే అది తన స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేదని అన్నారు. సాహెబ్, మీరు నన్ను జైలులో పెట్టడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టవచ్చు, కానీ మీరు నా స్పూర్తిని విచ్ఛిన్నం చేయలేరు. బ్రిటీష్ పాలకులు స్వాతంత్ర్య సమరయోధులను కూడా ఇబ్బందులకు గురిచేశారు, కానీ వారి మనోభావాలు విచ్ఛిన్నం కాలేదు. జైలు నుండి మనీష్ సిసోడియా సందేశం అంటూ ఆప్ అధినేత అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి హిందీలో ఒక ట్వీట్ చేసారు.