Site icon Prime9

Virginity test: హత్యకేసులో 16 ఏళ్ల తరువాత నిందితురాలికి కన్యత్వ పరీక్ష.. రాజ్యాంగ విరుద్దమన్న ఢిల్లీ హైకోర్టు

Virginity test

Virginity test

Virginity test: ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉన్నమహిళా ఖైదీకి కన్యత్వ పరీక్ష నిర్వహించడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొంది.

ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించిడమని తెలిపింది.

కన్యత్వ పరీక్షలు మహిళ యొక్క శారీరక సమగ్రతను మరియు మానసిక సమగ్రతను ఉల్లంఘిస్తాయని వ్యాఖ్యానించింది.

1992 కేరళలో జరిగిన సిస్టర్ అభయ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సిస్టర్ సెఫీ దాఖలు చేసిన

పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ఢిల్లీ హైకోర్టు బెంచ్ అనుమతించింది.

సిస్టర్ అభయ  హత్య కేసు ..

మార్చి, 1992లో, కేరళలోని కొట్టాయంలోని సెయింట్ పియస్ కాన్వెంట్‌లోని బావిలో అభయ శవమై కనిపించింది.

ప్రాథమిక పోలీసు దర్యాప్తు మానసిక అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారించింది.

అయితే స్థానికులనుండి వచ్చిన ఒత్తిడి కారణంగా, దర్యాప్తు 1993లో సీబీఐకి బదిలీ చేయబడింది.

ఈ కేసును విచారించిన సీబీఐ తొలి బృందం మరణానికి గల కారణాలపై ఎలాంటి నిర్ధారణకు రాలేదు.

ఆ తర్వాత రెండో సిబిఐ బృందాన్ని రప్పించారు, అది హత్య అని,

అయితే నిందితులను పట్టుకోవడానికి ఆధారాలు లేవని తెలిపింది.

దీనితో ఈ రిపోర్టును అంగీకరించడానికి నిరాకరించిన కోర్టు విచారణను కొనసాగించాలని కోరింది.

2005లో సీబీఐ మరో రిపోర్టును కోర్టు ముందు దాఖలు చేసింది, అది కూడా తిరస్కరించబడింది.

2008 నాటికి, సిబిఐ నాలుగుసార్లు కేసును మూసివేయాలని కోర్టును ఆశ్రయించింది.

దీనితో హైకోర్టు సిబీఐ రాష్ట్ర విభాగానికి దర్యాప్తును అప్పగించింది.

2008లో కొత్త సిబిఐ బృందం కాన్వెంట్ నుండి ఇద్దరు ఫాదర్లు మరియు సిస్టర్ సెఫీని అరెస్టు చేసి,

సిస్టర్ అభయ హత్యకు పాల్పడినట్లు అభియోగాలు మోపింది.

డిసెంబరు 2020లో ఫాదర్ థామస్ కొట్టూర్ మరియు సిస్టర్ సెఫీ హత్యకు పాల్పడినట్లు

నిర్ధారించబడింది. వీరికి జీవిత ఖైదు విధించబడింది.

సీబీఐ నా ఇష్టానికి వ్యతిరేకంగా కన్యత్వ పరీక్ష నిర్వహించింది..(Virginity test)

2009లో, “దర్యాప్తులో భాగంగా” సీబీఐ తన ఇష్టానికి విరుద్ధంగా మరియు తన అనుమతి లేకుండా

కన్యత్వ పరీక్ష చేయించిందని పేర్కొంటూ సిస్టర్ సెఫీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

కాన్వెంట్‌లోని ఇద్దరు ఫాదర్లతో తాను లైంగిక సంబంధాలు కలిగి ఉన్నాననే సిద్ధాంతాన్ని రూపొందించేందుకు

సీబీఐ ఇలా చేసిందని సిస్టర్ సెఫీ ఆరోపించారు.

ఆరోపించిన హత్యతో తన కన్యత్వానికి ఎలాంటి సంబంధం లేదని, తనను కించపరిచే ఉద్దేశ్యంతో

మరియు తప్పుడు కేసును రుజువు చేయాలనే ఉద్దేశ్యంతో కన్యత్వ పరీక్ష జరిగిందని సిస్టర్ సెఫీ తన పిటిషన్‌లో పేర్కొంది.

తన గౌరవానికి భంగం వాటిల్లిందని ఆరోపించిన ఆమె, అందుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడమే కాకుండా,

ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను శిక్షించాలని అన్నారు.

కేసు విచారణకు అవసరమైనందునే కన్యత్వ పరీక్ష.. సీబీఐ

ఈ కేసులో విచారణకు అవసరమైనందున ఆమెకు కన్యత్వ పరీక్ష నిర్వహించామని సీబీఐ సమర్థించుకుంది.

ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో, “ఆమెకు ఎటువంటి నష్టం

జరగలేదు కాబట్టి, ఆమెకు పరిహారం ఇవ్వడానికి అనుమతించలేము” అని సీబీఐ పేర్కొంది.

నిందితురాలిపై ఇటువంటి పరీక్ష నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించలేదని సీబీఐ పేర్కొంది.

అలాగే కేరళ హైకోర్టులో విచారణ (శిక్షకు వ్యతిరేకంగా అప్పీల్ ద్వారా) ఇంకా కొనసాగుతున్నందున

ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోకూడదని పేర్కొంది.

కన్యత్వ పరీక్షపై ఢిల్లీ  హైకోర్టు ఏం చెప్పింది?

57 పేజీల తీర్పులో, ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇలా పేర్కొంది.

కన్యత్వ పరీక్షలు ఆధునికమైనవి లేదా శాస్త్రీయమైనవి కావు.

అవి ప్రాచీనమైనవి మరియు అహేతుకమైనవి. ఆధునిక సైన్స్ మరియు వైద్య చట్టం

మహిళలపై ఇటువంటి పరీక్షలను నిర్వహించడాన్ని నిరాకరించింది.

లైంగిక వేధింపులకు గురైన బాధితురాలితో పాటు నిర్బంధంలో ఉన్న మరే ఇతర మహిళపైనా

కన్యత్వ పరీక్ష చాలా బాధాకరమైనది. ఇది మహిళ యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై

వినాశకరమైన ప్రభావాలను కలిగి ఉంటుందని హైకోర్టు తీర్పు చెప్పింది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version