Site icon Prime9

Viral Video: పెళ్లిలో పనీర్ కోసం బెల్టులతో చితక్కొట్టుకున్నారు..

Viral video

Viral video

Viral Video: జనరల్ గా పెళ్లిలో గొడవ అంటే.. కట్నం కోసమో, మర్యాదల దగ్గరో, బంధువుల మధ్య ఏదో ఒకటి జరుగుతుంటాయి. ఇంకా అయితే ఈ కాలంలో పెళ్లిలో నాన్ వెజ్ పెట్టలేదని జరిగిన గొడవలను చూశాం. ఇలాంటి గొడవల చాలా సార్లు పెళ్లిళ్లు ఆగిన సందర్భాలు ఉన్నాయి.

కానీ ఇపుడు చెప్పుకోబోయే ఘటన వాటన్నింటికి విరుద్ధం. ఉత్తర ప్రదేశ్ (Uttar pradesh) లో జరిగిన ఓ వేడుకలో పనీర్ కర్రీ పెట్టలేదని రచ్చ రచ్చ చేశారు. ఈ వివాదం కాస్త ఇరు కుటుంబాల్లో పెద్ద గొడవకు దారి తీసింది. ఇరు కుటుంబాలు అంతటితో ఆగకుండా బెల్టులతో చితక్కొట్టుకున్నారు. ఓ చిన్న కారణంతో సంతోషంగా జరగాల్సిన వేడుకలో గొడవలు సృష్టించారు.

 

వైరల్ గా మారిన వీడియో(Viral Video)

యూపీలోని బాగపత్ లో ఓ వివాహ వేడుక జరిగింది. విందులో పనీర్‌ పెట్టలేదని పెళ్లికొడుకు తరపు బంధువు ఒకరు గొడవకు దిగారు. అది చిలికి చిలికి గాలి వానలా మారింది. దీంతో ఇరు కుటుంబాల వాళ్లు బెల్టులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వేడుక జరిగే చోటుకు చేరుకుని కొంతమందిని అరెస్టు చేశారు.

అనంతరం ఇరువర్గాల మధ్య రాజీ కుదరడంతో అందరినీ విడిచిపెట్టారు. ఈ పనీర్ గొడవను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. పనీర్ కోసం ఇంత గొడవ ఏంటని పలువురు నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేశారు.

పనీర్ తెచ్చిన తంటా.. చివరికి పెళ్లి జరగకుండానే పోయింది. పనీర్ కోసం ఇలా గొడవపడిన వీడియో .. పలువురికి నవ్వు తెప్పిస్తుంది.

Exit mobile version