Naked Women CCTV: అర్దరాత్రి అయితే చాలు.. ఆ మహిళ నగ్నంగా రోడ్లపైకి వస్తుంది. అంతే కాదు.. వీధుల్లో తిరుగుతూ.. ఇంటి తలుపులు తడుతూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్నిసార్లు తలుపులు తెరిచే ప్రయత్నం కూడా చేస్తోంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో చోటు చేసుకుంది.
ఒంటి మీద నూలు పోగు లేకుండా..
ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోని మిలాక్ గ్రామంలో ఓ యువతి చేస్తున్న వింత పనులు.. అక్కడి వారిని భయానికి గురి చేస్తోంది.
రాత్రి అయితే చాలు.. వారికి వణుకు పుట్టిస్తుంది. ఆ యువతి చేస్తున్న పనికి కంటి మీద కునుకు లేకుండా పోతుందని.. స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
ఓ గుర్తు తెలియని మహిళ.. మిలాక్ గ్రామంలో అలజడి రేపుతోంది. ప్రతి రోజు అర్ధరాత్రి.. నగ్నంగా (Naked Women) బయటకు వస్తుంది.
బట్టలు లేకుండా.. వీధుల్లో తిరగడం, ఇంటి తలుపులు కొట్టడం వంటివి చేస్తుంది. ఈ వ్యవహారం మెుత్తం సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. కొంతమంది స్థానికులు ఆమెన దెయ్యంగా భావిస్తున్నారు.
సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది అమ్మాయిలు ఇంటికే పరిమితం అవుతారు.
రాత్రి సమయాల్లో బయటకు రావడానికి భయపడుతారు. అలాంటిది అలాంటిది ఓ యువతి.. అర్థరాత్రి వీధుల్లోకి నగ్నంగా వస్తుంది.
ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా.. ఇళ్ల ముందుకెళ్లి తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తుంది.
यूपी के रामपुर में निर्वस्त्र महिला से दहशत ! आधी रात में खटखटाती है घर के दरवाजे, CCTV वीडियो हुआ वायरल#Rampur #CCTV #ViralVideo pic.twitter.com/UN16rpf2Rk
— India TV Hindi (@IndiaTVHindi) February 2, 2023
నగ్నంగా ఇంటి తలుపులు తెరిచే ప్రయత్నం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ దృశ్యాలను చూసి స్థానికులు తెగ వణికిపోతున్నారు. ఆ యువతి ఎవరు.. ఎందుకలా చేస్తుంది అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులను ఆశ్రయించారు.
ఎందుకిలా చేస్తుంది..
ఇలా వింతగా ప్రవర్తిస్తున్న యువతి వయసు.. 25ఏళ్లు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఓ మహిళ ఇచ్చిన దీనిపై వివరణ ఇచ్చారు. తన ఇంటి ముందుకు వచ్చిన యువతి.. ఇంటి కాలింగ్ బెల్ నొక్కి అక్కడే 5 నిమిషాలు నిలబడినట్లు తెలిపింది.
ఈ ఘటనపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ యువతి ఇలా ఎందుకు చేస్తుందో అర్ధం కావాడం లేదని పోలీసులు అన్నారు.
యువతి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
దీనిపై మరింత లోతుగా విచారణ చేసేందుకు ఇతర సీసీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ మెుత్తం వ్యవహారం స్థానికులను టెన్షన్ పెడుతోంది.
ఆ యువతి ఎందుకిలా చేస్తుందో.. గుర్తించాలని కోరుతున్నారు. దీని వెనుకున్న మిస్టరీని త్వరగా తేల్చాలని విజ్ఞప్తి చేశారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/