New Delhi: శుక్రవారం ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) 22వ సమావేశంలో 2022-2023 సంవత్సరానికి గానూ వారణాసి మొట్టమొదటి SCO టూరిజం మరియు కల్చరల్ క్యాపిటల్‌గా నామినేట్ చేయబడింది. ఈ పరిణామాన్ని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా విలేకరుల సమావేశంలో ధృవీకరించారు.
“వారణాసిని మొట్టమొదటి SCO పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానిగా ప్రతిపాదించడం భారతదేశం మరియు SCO సభ్య దేశాల మధ్య పర్యాటక, సాంస్కృతిక మరియు మానవతా మార్పిడిని ప్రోత్సహిస్తుంది. ఇది SCO సభ్య దేశాలతో, ముఖ్యంగా సెంట్రల్ ఆసియా రిపబ్లిక్‌లతో భారతదేశపు ప్రాచీన నాగరికత సంబంధాలను కూడా చెబుతుంది అంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది
ఈ సాంస్కృతిక ప్రచార కార్యక్రమం కింద వారణాసిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లలో పాల్గొనడానికి SCO సభ్య దేశాల నుండి అతిథులు ఆహ్వానించబడతారు. “ఈ ఈవెంట్‌లు ఇండాలజిస్టులు, విద్వాంసులు, రచయితలు, సంగీతకారులు మరియు కళాకారులు, ఫోటో జర్నలిస్టులు, ట్రావెల్ బ్లాగర్లు మరియు ఇతర ఆహ్వానిత అతిథులను ఆకర్షిస్తాయని భావిస్తున్నారు” అని విదేశాంగశాఖ పేర్కొంది. ఈ చర్య వారణాసి పర్యాటకానికి ఊతం ఇస్తుంది.