Maharashtra: భాజపా, ఏకనాధ్ షిండేల సంకీర్ణంతో ఏర్పడిన మహారాష్ట్ర సర్కారు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. పాశ్చాత్య భాషకు చరమగీతం పాడుతూ హలో అనే మాటకు బదులుగా వందేమాతరం అంటూ అభినందించాలంటూ కొత్త చట్టం తెచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఇది వర్తిస్తుందని మహారాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం పేర్కొనింది. అక్టోబర్ 2 నుండి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొనింది.
బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ‘వందేమాతరం’ పాటను ఆలపిస్తూ అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారని, ఇది మనందరం గుర్తుంచుకోవాల్సిన అంశంగా తీర్మానంలో పేర్కొంది.
ప్రజలు లేదా అధికారుల నుంచి ఫోన్స్ వచ్చినప్పుడు హలో బదులు వందేమాతరం అనే పదాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉద్యోగుల స్పందన ఎలా ఉండబోతుంది అనేది పెద్ద సమస్యగా మారనుంది.
మరో వైపు వందేమాతరం అనే పదాన్ని వాడుకలో తెచ్చేందుకు పలు మార్గాల్లో ఉద్యోగులతో ఫోన్ లో మాట్లాడనున్నట్లు వర్గాల భోగట్టా. అతిక్రమించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్న విషయంపై తర్జన భర్జన పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Swimming Deaths: ఈత సరదా.. నలుగురు చిన్నారులు మృతి