Woman Tortures Husband: మన దేశంలో భర్తలు భార్యలను చిత్రహింసలకు గురి చేసే ఘటనలు కొకొల్లలు.. అదే భార్య భర్తను చిత్ర హింసలకు గురి చేసే ఘటనలు ఎప్పుడో అసాధారణంగా చోటు చేసుకుంటాయి. ఒక వేళ తన భార్య తనను టార్చర్ చేస్తోందని చెప్పినా.. ఎవరూ నమ్మరు… కావాలనే భార్యపై అపవాదు వేస్తున్నాడని భర్తనే అనుమానించడం మన దేశంలో సహజం. అయితే ఉత్తరప్రదేశ్‌లో సీన్ కాస్తా రివర్స్ అయ్యింది. భార్య భర్తను చిత్రహింసల పాలు చేయడమే కాకుండా భౌతికంగా దాడి చేయడం… రెండు కాళ్లు, చేతులు వెనక్కి కట్టి సిగరెట్‌తో కాల్చడం లాంటివి భర్త భరించాల్సి వచ్చింది. అయితే భర్త తెలివిగా ఇంట్లో సీసీటీవీలో భార్య చేసే టార్చర్‌ను రికార్డు చేయడంతో భర్త చెప్పే మాటలను నమ్మాల్సి వచ్చింది.
మత్తు ఇచ్చి ..కాళ్లు, చేతులు కట్టి..(Woman Tortures Husband)
ఇక ఈ సంఘటన జరిగింది మాత్రం ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో.. కాగా భర్త చేతులు, కాళ్లు కట్టేసిన తర్వాత మండుతున్న సిగరెట్లతో దేహంపై పలు చోట్ల కాల్చింది భార్య. భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని సియోహరా జిల్లాలో భార్య మెమర్‌ను ఈ నెల 5న అరెస్టు చేశారు. ఇక భర్త పేరు మన్నన్ జైదీ. ఇక భర్త వాదన ఏమిటంటే తన భార్య మెహర్ తనకు మత్తు ఇచ్చి తన కాళ్లు, చేతులు కట్టి సిగరెట్‌తో దేహంలోని పలు భాగాల్లో కాల్చేదని చెప్పాడు. పోలీసులకు సీసీటీవీలో రికార్డు అయిన ఫుటేజీ చూపించాడు. సీసీటీవీలోభార్య మెహర్ భర్తపై దాడి చేయడం, చేతులు కాళ్లు కట్టి.. గొంతు పిసకడానికి ప్రయత్నించడం…. ఆతడి చాతీలో పై కూర్చోవడం కనిపించింది. తర్వాత వీడియోలో మెహర్ సిగరెట్‌తో శరీరంలోని పలు చోట్ల కాల్చడం కనిపించింది.
బాధిత భర్త గతంలోను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. తనకు మత్తు మందు ఇచ్చి తన కాళ్లు, చేతులు కట్టి చిత్రహింసలకు గురి చేసేదని ఫిర్యాదు చేశాడు. అయితే తాజాగా మన్నన్ జైదీ సీసీటీవీ రికార్డులను పోలీసులకు చూపించడంతో పోలీసులు వివిధ సెక్షన్‌ల కింద అమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై హత్య యత్నం కేసు కూడా నమోదు అయ్యిందని జిల్లా సూపరింటెండెంట్ ధరంపాల్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు