UPSC Result: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. 2022కి సంబంధించిన ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఇక తొలి నాలుగు ర్యాంకుల్లో అమ్మాయిలే సత్తాచాటారు. దీంతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కూడా మెరుగైన ర్యాంకులు సాధించారు.
అమ్మాయిలదే హవా..
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. 2022కి సంబంధించిన ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఇక తొలి నాలుగు ర్యాంకుల్లో అమ్మాయిలే సత్తాచాటారు. దీంతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కూడా మెరుగైన ర్యాంకులు సాధించారు.
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2022 తుది ఫలితాలు నేడు విడుదలయ్యాయి.
దేశవ్యాప్తంగా మెుత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. జనరల్ కోటాలో 345 మంది,
ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు.
ఇక పోస్టుల వారీగా చూస్తే.. ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38, ఐపీఎస్‌కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు.
ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ – ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్ బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది.
తొలి నాలుగు ర్యాంకులు వారివే.. (UPSC Result)
యూపీఎస్సీ ప్రకటించిన ర్యాంకుల్లో తొలి నాలుగు స్థానాల్లో అమ్మాయిలే నిలిచారు.
ఇషికా కిశోర్ అనే అమ్మాయి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో అదరగొట్టింది.
గరిమ లోహియా, ఉమా హారతి ఎన్. స్మృతి మిశ్రా తర్వాతి నాలుగు ర్యాంకుల్లో మెరిశారు.
తెలుగు రాష్ట్రాల విద్యార్ధుల హవా..
తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు సివిల్స్‌లో సత్తా చాటారు. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్ దత్తా 22 ర్యాంకుతో మెరవగా..
శాఖమూరి శ్రీసాయి అర్షిత్ 40, ఆవుల సాయికృష్ణ 94,
అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్ కుమార్ 157,
కమతం మహేశ్‌కుమార్ 200, రావుల జయసింహారెడ్డి 217,
బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292,
గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్.చేతనా రెడ్డి 346,
శృతి యారగట్టి ఎస్ 362, యప్పలపల్లి సుష్మిత 384,
సీహెచ్ శ్రావణ్‌కుమార్ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న 462 ర్యాంకులతో సత్తా చాటారు.