Site icon Prime9

Supreme Court: సుప్రీంకోర్టు అసాధారణ తీర్పు.. 30 వారాల గర్బాన్ని తొలగించుకునేందుకు అనుమతి

Supreme Court: 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు తన 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు అసాధారణ తీర్పును వెలువరించింది. దీనికి వ్యతిరేకంగా బాంబే హైకోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై గర్బం దాల్చింది. ఈ విషయం తల్లికి తెలియడంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తె 28 వారాల గర్బాన్ని తొలగించేందకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే అబార్షన్ కు నిరాకరించిన బాంబే హైకోర్టు ఈ పిటిషన్ ను కోట్టేసింది.ద ీనితో బాధితురాలి తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఆర్టికల్ 142 కింద..(Supreme Court)
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ముంబైలోని సియాన్ ఆసుపత్రి మెడికల్ బోర్డు నివేదిక కోరింది. ఈ సమయంలో అబార్షన్ చేస్తే కొంత ప్రమాదం ఉనన్ప్పటికీ కాన్ను తర్వాత ఎదరయ్యే సమస్యలతో పోల్చితే ఇది పెద్దది కాదని మెడికల్ బోర్డు తన నివేదికలో తెలిపింది. ఈ నివేదికను పరిశీలించిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బాలిక 30 వారాల అబార్షన్ కు అనుమతి ఇచ్చింది. రాజ్యాంగంలోని అర్దికల్ 142 కింద ఉన్న అధికారాలతో ఈ తీర్పును వెలువరిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 2021 ప్రకారం, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అభిప్రాయంతో 20 వారాల వరకు అబార్షన్‌లు అనుమతించబడతాయి. కొన్ని సందర్భాల్లో, 24 వారాల వరకు అనుమతించబడతాయి. అయితే ఈ కాలపరిమితి మించిన గర్భాలకు, ఈ కేసులో ప్రదర్శించినట్లుగా, కోర్టు జోక్యం అవసరం.సెప్టెంబరు 2021లో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (సవరణ) చట్టం అమల్లోకి వచ్చింది, అబార్షన్ కోసం ఎగువ గర్భధారణ పరిమితిని 20 నుండి 24 వారాలకు పొడిగించింది. ఈ సవరణ గర్భిణీ స్త్రీ యొక్క హక్కుగా డిమాండ్‌పై అబార్షన్‌ను గుర్తించనప్పటికీ, భారతీయ అబార్షన్ చట్టాలను మరింత ప్రగతిశీలంగా మార్చడంలో ఇది తదుపరి దశగా పేర్కొనబడింది. అనుమతించదగిన గర్భధారణ కాలానికి మించి అవాంఛిత గర్భాలు కలిగిన అనేక మంది స్త్రీల నుండి సురక్షితమైన వైద్య సహాయాన్ని పొందాలనే అభ్యర్థనలను స్వీకరించిన తరువాత ఈ సవరణ చేయడం జరగింది.

Exit mobile version