Ghaziabad: ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆన్‌లైన్ మత మార్పిడి రాకెట్‌ను భగ్నం చేసిన దీనిలో టీనేజర్లను తమ మతం మార్చుకోవడానికి వారిని ప్రలోభపెట్టడానికి ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ద్వారా లక్ష్యంగా చేసుకున్నారు.ఈ పద్ధతిలో మతం మారిన నలుగురు మైనర్లు ఘజియాబాద్ నుండి ఇద్దరు మరియు ఫరీదాబాద్ మరియు చండీగఢ్ నుండి ఒక్కొక్కరిని ఇప్పటివరకు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
గేమింగ్ యాప్ ద్వారా..(Ghaziabad)
ఈ గ్యాంగ్ ఎవరినైతే ఇస్లాంమతంలోకి మార్చాలనుకున్నారో వారిని లక్ష్యంగా చేసుకొని వారిని ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ద్వారా వల వేస్తారు. టీనేజ్ బాలురతో ఆన్‌లైన్‌లోనే మచ్చిక చేసుకున్న తర్వాత వారికి ఇస్లామ్ మత ప్రచారకుడు జాకీర్ నాయక్ లాంటి వారు ఇస్లాం మతం గురించి ప్రసంగించిన వీడియోలు చాటింగ్ యాప్ ద్వారా చూపిస్తారు. ఇలా టీనేజీ బాలురను ఇస్లాం మతంలోకి మార్చుతున్న ఘటనలు వెలుగు చూశాయి.
టీజేజ్ యువకులను మత మార్పిడి చేయిస్తున్నారన్న సమాచారం ఉత్తరప్రదేశ్ పోలీసులకు అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ గ్యాంగ్ ఆటకట్టించింది. ఈ సంఘటనకు సంబందించి ఓ యువకుడిని పోలీసులు అరెస్టు అరెస్టు చేశారు. కాగా అరెస్టు అయిన వ్యక్తి ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ఫోర్ట్‌నైట్ యాప్ ద్వారా టీనేజ్ బాలురను ఆకట్టుకొని అటు తర్వాత వారిని మత మార్పిడి చేయించే వారు. రెండో నిందితుడు మహారాష్ర్టలోని థానేకు చెందిన వాడు. ప్రస్తుతం అతను అరెస్టు నుంచి తప్పించుకు పారిపోయాడు. పోలీసులు అతని కోసం పెద్ద ఎత్తున గాలింపు ప్రారంభించారు. మొత్తానికి గేమింగ్ యాప్ ద్వారా నలుగురు మైనర్ బాలురను ఇస్లామ్ మతంలోకి మర్పించారని తెలిసింది. ఘజియాబాద్‌కు చెందిన ఇద్దరు, ఫరీదాబాద్, చండీఘడ్‌ల నుంచి చెరో టీనేజర్‌ను ఇస్లాం మంతంలోకి మార్పించారు. వీరంతా గేమింగ్ యాప్ ఉచ్చులో పడి ఇస్లాంలోకి మారపోయారు.
ఖరాన్‌లో పద్యాలు చదవితే గెలుస్తారని..
యూపీ పోలీసు ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం ప్రధాన నిందితుడు షా నవాజ్ ఖాన్.. అతని డిజిటల్ పేరు ‘బ్యాడ్డో” ఇతను ఫోర్ట్‌నైట్ గేమ్ ఆడే పిల్లలు గుర్తించే వాడు. ఎవరైతే టీనేజ్ పిల్లలు గేమ్ ఓడిపోతే.. మీరు గేమ్ గెలవానుకుంటే ఖరాన్‌లోని కొన్ని పద్యాలు చదవితే గెలుస్తారని ఉత్సాహపరిచే వారు. టీనేజర్లు గేమ్ గెలిస్తే.. వారికి ఖురాన్ పట్ల ఆసక్తి కలగడంతో పాటు నమ్మకం కుదురుతుంది. అటు తర్వాత వారిని ఉచ్చులోకి లాగి ఇస్లాంమతంలోకి మార్చుతున్నారు. కాగా నిందితులు ఎవరినైతే ఇస్లాంలోకి మార్చాలనుకుని లక్ష్యంగా పెట్టుకుంటారో వారితో టచ్‌లో ఉంటారు. ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ద్వారా వారిని ఆకర్షిస్తారు. అదే సమయంలో వారితో సన్నిహితంగా ఉంటూ ఇస్లాం మత ప్రచారకుడు జాకీర్ నాయక్‌తో పాటు తారిఖ్ జమీల్ ప్రవచనాల వీడియోలు చూపిస్తారు. అయితే పోలీసుల విచారణలో పలు దిగ్బ్రాంతి కలిగించే అంశాలు వెలుగు చూశాయి. చాటింగ్ ఇంజిన్ ద్వారా ఇక్కడే కాకుండా యూరప్‌లోని వివిధ దేశాలకు చెందిన టీనేజర్లకు కూడా గాలం వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే వీరికి అంతర్జాతీయంగా కూడా సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఇస్లాం మతంలోకి మారిన పిల్లలు వాస్తవానికి క్రిస్టియన్ మతానికి చెందిన వారు వారిని తర్వాత ఇస్లాం మతంలోకి మార్చారు.