Site icon Prime9

UP COP: రూ.500 నోట్ల కట్టలతో సెల్ఫీ తీసుకున్న భార్య, పిల్లలు .. చిక్కుల్లో పడిన యూపీ పోలీసు అధికారి

UP cop

UP cop

UP COP:  ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని ఒక పోలీసు అధికారికి నగదు కట్టలతో అతని కుటుంబం సెల్ఫీ తీసుకున్న తక్షణమే బదిలీ అయింది. అతని భార్య మరియు పిల్లలు తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో వారు రూ. 500 నోట్ల కట్టలతో పోజులివ్వడంతో అతనిపై విచారణ ప్రారంభించబడింది.ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫోటో, 14 లక్షల రూపాయల విలువైన భారీ నగదుతో ఒక బెడ్‌పై కూర్చున్న పోలీసు అధికారి భార్య మరియు ఇద్దరు పిల్లలను చూపిస్తుంది.

ఆస్తిని అమ్ముకున్పపుడు తీసిన ఫోటో..(UP COP)

నోట్ల కట్టలతో ఉన్న అధికారి ఫోటో వైరల్ అయిన వెంటనే, సీనియర్ పోలీసు అధికారి వెంటనే ఈ విషయంపై విచారణకు ఆదేశించారు. స్టేషన్‌ ఇన్‌చార్జి రమేష్‌ చంద్ర సహాని పోలీస్‌ లైన్‌కు బదిలీ అయ్యారు.అయితే, రమేష్ చంద్ర సహాని తనను తాను సమర్థించుకున్నాడు. ఈ ఫోటో నవంబర్ 14, 2021న తాను కుటుంబ ఆస్తిని విక్రయించినప్పుడు తీశానని చెప్పాడు.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ, ఒక సీనియర్ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ స్టేషన్-హౌస్ ఆఫీసర్ యొక్క ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పోలీసు భార్య మరియు అతని పిల్లలను నోట్ల కట్టలతో చూపిస్తుంది. మేము ఈ విషయాన్ని గుర్తించాము. సదరు అధికారి పోలీసు లైన్‌కు బదిలీ చేయబడ్డాడు. దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

Exit mobile version