Site icon Prime9

Yogi Adityanath : పాలిటిక్స్ నాకు ఫుల్‌టైమ్‌ జాబ్‌ కాదు : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath : ప్రధాని మోదీ వారసత్వం గురించి మహారాష్ట్ర అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజకీయ జీవితంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్రానికి సీఎంను అన్నారు. పార్టీ తనను ఉత్తరప్రదేశ్ ప్రజల కోసం నియమించిందని చెప్పుకొచ్చారు. అందుకే యూపీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు. ఇక రాజకీయాలు తనకు ఫుల్‌టైమ్‌ జాబ్‌ కాదని, వాస్తవానికి తాను ఒక యోగినని ఆయన పేర్కొన్నారు.

 

 

 

ప్రతి పనికి ఒక కాలపరిమితి ఉంటుంది..
ప్రతి పనికి ఒక కాలపరిమితి ఉంటుందని, తన రాజకీయ జీవితానికి కూడా పరిమితి ఉంటుందని యోగి అన్నారు. జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానంతో తనకు విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తనకు పార్టీ ఇచ్చిన అవకాశం వల్లే ఇంత స్థాయికి చేరారని చెప్పారు. పార్టీ పెద్దలతో విభేదాలు ఉంటే సీఎం స్థానంలో కొనసాగేవాడిని కాదన్నారు. ఎవరో ఒకరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారని, వాటిని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు.

 

 

శివసేన నేత మోదీపై తీవ్ర వ్యాఖ్యలు..
ఆదివారం నాగ్‌పుర్‌లోని సంఘ్‌ ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని మోదీ సందర్శించడంపై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో ఎన్నడూ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి వెళ్లని ప్రధాని ఇప్పుడు వెళ్లడం వెనక ముఖ్యమైన కారణం ఉండొచ్చన్నారు. మోదీ పదవీ విరమణ చేయాలని యోచిస్తున్నారని, తన రిటైర్మెంట్‌ ప్రణాళికల గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌తో చర్చలు జరపడానికే అక్కడికి వెళ్లి ఉంటారని అభిప్రాయం వ్యక్తంచేశారు. దేశ రాజకీయ నాయకత్వంలో ఆరెస్సెస్‌ మార్పు కోరుకొంటోందని, మోదీ వారసుడు మహారాష్ట్ర నుంచి వస్తాడన్నారు. ఆయన వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొట్టిపడేశారు. ఈ నేపథ్యంలో యోగి మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Exit mobile version
Skip to toolbar