Prime9

Rammohan Naidu : ప్రమాదన ఘటనపై సమగ్ర దర్యాప్తు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Union Minister Rammohan Naidu : అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమానం ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ప్రధాని మోదీ ఫోన్‌ చేసి ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని వివరించారు. అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరుగుతోందని, మృతుల సంఖ్య గురించి ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రమాద బాధ్యులను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. విమాన ప్రయాణికుల్లో మాజీ సీఎం విజయ్‌ రూపానీ ఉన్నారని తెలిపారు. ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు.

 

సహాయక చర్యలపై డీజీసీఏ, ఏఏఐ, ఎన్డీఆర్‌ఎఫ్‌, గుజరాత్‌ సర్కారు సీనియర్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ దర్యాప్తు కోసం బృందంతో అహ్మదాబాద్‌కు చేరుకుంది. ప్రమాదానికి సంబంధించి అన్ని కారణాలపై ఆరా తీస్తున్నది. దర్యాప్తు తర్వాత ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. విమానం ఓ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌పై కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఎంతమంది మృతిచెందారనే విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు.

Exit mobile version
Skip to toolbar