Site icon Prime9

Union Health Ministry: ర్యాంటాక్‌, జింటాక్‌ టాబ్లెట్లను నిషేధించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

medicine prime9news

medicine prime9news

New Delhi: మనలో చాలామంది గ్యాస్ సమస్యలతో బాగా ఇబ్బంది పడుతుంటారు. ఆ సమయంలో గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందని వెంటనే టాబ్లెట్ వేసుకుంటారు. తాజాగా 26 రకాల ఔషధాలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించినట్లు తెలిసిన సమాచారం. ఈ లిస్టు నుంచి గ్యాస్ టాబ్లెట్స్ ర్యాంటాక్‌, జింటాక్‌ లను పూర్తిగా తొలగించినట్లు పేర్కొన్నారు. ర్యాంటాక్‌, జింటాక్‌ టాబ్లెట్లను ఎక్కువుగా వాడటం వల్ల క్యాన్సర్‌ సమస్యలు వస్తున్నాయని కేంద్రం తెలిపింది. ఇవి రెండూ టాబ్లెట్ మాత్రమే కాకుండా వాటితో పాటు 26 ర‌కాల మందుల‌ను ఇండియా మార్కెట్ వెంటనే నుంచి తొల‌గించాల‌ని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసిన సమాచారం. ర్యాంటాక్‌, జింటాక్‌ టాబ్లెట్లు డోస్ తక్కువ ఉంటాయి కాబట్టి డాక్టర్లు ఎసిడిటీ సమస్యలకు ఈ టాబ్లెట్స్ ను రోగులకు సూచిస్తారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ 384 ఔషధాలను విడుదల చేయగా వాటిలో నుండి ఈ 26 ఔషధాలను వాటి నుంచి తొలగించినట్టు తెలిసిన సమాచారం.

వీటిలో మనం వాడే మందులు, ఔషధాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. గిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2a, పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2బి, పెంటమిడిన్, ప్రిలోకైన్ (A) + లిగ్నోకైన్ (B, ప్రోకార్బజైన్, రానిటిడిన్, రిఫాబుటిన్, స్టావుడిన్ (ఎ) + లామివుడిన్ (బి), సుక్రాల్‌ఫేట్, వైట్ పెట్రోలేటం, ఆల్టెప్లేస్, అటెనోలోల్, మనం రోజు వాడే బ్లీచింగ్ పౌడర్ కూడా ఉంది. కాప్రోమైసిన్, సెట్రిమైడ్, క్లోర్ఫెనిరమైన్, డిలోక్సనైడ్ ఫ్యూరోయేట్, డిమెర్కాప్రోల్, ఎరిత్రోమైసిన్, ఇథినైల్స్ట్రాడియోల్, ఇథినైల్‌స్ట్రాడియోల్(ఏ) నోరెథిస్టిరాన్ (బీ),గాన్సిక్లోవిర్, కనామైసిన్, లామివుడిన్ (ఎ)+నెవిరాపైన్ (బి)+ స్టావుడిన్ (సి),లెఫ్లునోమైడ్, మిథైల్డోపా, నికోటినామైడ్ నిషేధించిన ఈ 26 ఔషధాలు విడుదల చేసిన లిస్టులో ఉన్నాయి.

Exit mobile version