Prime9

Union Cabinet Decisions: ముగిసిన కేంద్ర కేబినెట్ భేటి.. కీలక నిర్ణయాలకు ఆమోదం

Central Union Cabinet Decisions: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. భేటీలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఖరీఫ్ పంటలకు రూ. 2 లక్షల కోట్లకు పైగా నిధులను మద్ధతు ధర కోసం కేటాయించింది. ఈ ఏడాది 8 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు భారత్ లోకి వచ్చాయి. అలాగే దేశంలో ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ ముందుగానే చెప్పింది. ఈ నేపథ్యంలోనే అన్నదాతలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు తెలిపారు.

 

పంటల మద్దతు ధర కోసం రూ. 2, 07, 000 కోట్లను కేంద్రం కేటాయించిందన్నారు. అలాగే రైతు సంక్షేమం కోసం ఇంట్రెస్ట్ సబ్వేషన్స్ స్కీమ్ కూడా ప్రకటించిందని చెప్పారు. ఏపీలోని బద్వేలు- నెల్లూరు హైవేను 4 లైన్లుగా విస్తరించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. అలాగే వార్దా- బల్లార్షా హైవేను 4 లైన్లకు విస్తరించడం, రత్లాం- నాగాడా హైవేను నాలుగు లైన్లకు విస్తరించేందుకు కేంద్రం నిర్ణయించిందని తెలిపారు.

 

 

Exit mobile version
Skip to toolbar