Site icon Prime9

Viral Video In Bihar: పట్టాలు దాటుతుండగా ఊహించని ప్రమాదం.. ఏమైందో తెలుసా?

viral video

viral video

Viral Video In Bihar: పట్టాలు దాటుతున్న ఓ మహిళకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఆందోళన పడకుండా.. ఆ మహిళా సమయస్పూర్తితో వ్యవహరించడం వల్ల ఆమె ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సమయస్ఫూర్తితో వ్యవహరించిన మహిళ.. (Viral Video In Bihar)

బిహార్ లోని గయా జిల్లాలో ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ముందు వెనక చూసుకోకుండా పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. మెరుపు వేగంతో ఓ రైలు దూసుకురావడంతో.. సమయస్ఫూర్తితో వ్యవహరించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిహార్ గయా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. టన్‌కుప్ప రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ పట్టాలు దాటి.. మరో ప్లాట్ ఫాం పైకి వెళ్తుండగా.. గూడ్స్ రైలు కదిలింది. ఊహించని ప్రమాదం రావడంతో.. మహిళ చాకచక్యంగా పట్టాలపైనే పడుకుని ప్రాణాలను నిలబెట్టుకుంది. రైలు వెళ్లెంతవరకు అలాగే పడుకుని.. సమయస్ఫూర్తి ప్రదర్శించింది.

ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ ప్లాట్‌ ఫాంపై గూడ్స్‌ రైలు.. మరో ప్లాట్‌ఫాంపై ఆమె వెళ్లాల్సిన ప్యాసింజర్ రైలు ఉన్నాయి. ప్యాసెంజర్ రైలు ఎక్కేందుకు.. పట్టాలు దాటే ప్రయత్నం చేసినట్లు స్థానికులుల తెలిపారు. ఒక్కసారిగా గూడ్స్ రైలు కదలడంతో.. పట్టాలపై పడుకొని ప్రాణాలను కాపాడుకుంది.

ఫుట్ బోర్డు ఉన్న నిర్లక్ష్యం..

ప్రతి రైల్వే స్టేషన్లో పట్టాలు దాటేందుకు రైల్వేశాఖ కచ్చితంగా ఫుట్ బోర్డులు ఏర్పాటు చేస్తుంది. కానీ చాలా మంది నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు రోజు చోటు చేసుకుంటున్నాయి. రైళ్లను గమనించక.. పట్టాలు దాటుతున్నారు. మరికొందరు రైలు వస్తుందని తెలిసి కూడా పట్టాలు దాటే ప్రయత్నం చేస్తున్నారు. రైలు వేగాన్ని అంచనా వేయడంతో పొరబడి పట్టాలు దాటుతున్నారు. రైలు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న వీరిలో ఎలాంటి మార్పు రావడం లేదు.

Exit mobile version