Umesh Pal murder case: ఉత్తరప్రదేశ్ లో ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆతిక్ అహ్మద్‌నుఅదుపులోకి తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారం అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలుకు చేరుకున్నారు. సబర్మతి జైలు అధికారులు మరియు యుపి పోలీసు అధికారుల మధ్య అప్పగించే ప్రక్రియ పూర్తయిన తర్వాత అతడిని ప్రయాగ్‌రాజ్ జైలుకు తీసుకువెళ్లడానికి సిద్దమయ్యారు.
ఉత్తరప్రదేశ్ కోర్టు ఆదేశం ప్రకారం, 2018 కిడ్నాప్ కేసులో మార్చి 28న తీర్పు వెలువడనుంది.అతిక్ అహ్మద్‌తో సహా ఈ కేసులోని నిందితులందరినీ ఆ రోజు కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది.దీని ప్రకారం, రాబోయే 36 గంటల్లో అతిక్ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్‌కు తరలించడానికి యుపి పోలీసులు ఆదివారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని శివపురి మరియు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మీదుగా ఆతిక్ అహ్మద్ ను తీసుకు వెళ్లడానికి పోలీసులు ఒకప్రణాళికను రూపొందించారు.
వైరల్ అయిన వీడియో..( Umesh Pal murder case)
2005లో అప్పటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో అహ్మద్ ప్రధాన నిందితుడు, ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ఫిబ్రవరి 24న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపబడ్డాడు..కొద్ది రోజుల క్రితం, ప్రయాగ్‌రాజ్ కాల్పుల వీడియో వైరల్ అయింది అతిక్ అహ్మద్ కుమారుడు ఉమేష్ పాల్‌ను వీధిలో వెంబడిస్తున్నట్లు కనిపించింది.ఉమేష్ పాల్ హత్య కేసుకు సంబంధించిన 24 సెకన్ల ఈ తాజా వీడియో సీసీటీవీ ఫుటేజీలో బంధించిన పోలీసులకు కొత్త సాక్ష్యం. ఇప్పుడు ఈ కొత్త వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు.అంతకుముందు, యూపీలోని సీబీఐ కోర్టులో హాజరుపరిచినప్పుడు యూపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని అతిక్ అహ్మద్ వ్యక్తం చేశారు. అందుకే బదిలీ సమయంలో తనతో పాటు సీబీఐ బృందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టును అభ్యర్థించారు. దీనితో ఆతిక్ అహ్మద్ తో యూపీ పోలీసు బృందంతో పాటు సీబీఐ టీం కూడా వస్తుంది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆతిక్ అహ్మద్ ..
జూన్ 2019 నుండి సబర్మతి జైలులో ఉన్న అతిక్ అహ్మద్ ఈ నెల ప్రారంభంలో రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ప్రయాగ్‌రాజ్‌లోని ఉమేష్ పాల్ హత్య కేసులో తనను మరియు తన కుటుంబాన్ని నిందితులుగా తప్పుగా ఇరికించారని, ఉత్తరప్రదేశ్ పోలీసులచే బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపబడవచ్చని అతను పేర్కొన్నాడు.