Site icon Prime9

Udhayanidhi Stalin : తమిళనాడు క్యాబినెట్లో ఉదయనిధి స్టాలిన్… ఆ శాఖ మంత్రిగా ఛాన్స్ !

Stalin

Stalin

Udhayanidhi Stalin : తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మంత్రివర్గంలోకి అడుగుపెట్టబోతున్నారు. డీఎంకే కార్యకర్తలు ‘చిన్నవర్’ అని ముద్దుగా పిలుచుకునే ఉదయనిధి గత కొన్ని సంవత్సరాలుగా డిఎంకె యువజన విభాగంలో చురుకుగా ఉన్నారు. వాస్తవానికి డీఎంకే ప్రభుత్వం మొదటి మంత్రివర్గంలోనే ఉదయనిధి ఉండవలసింది. అతనికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న నిర్ణయానికి మంత్రుల నుంచి జిల్లా కార్యదర్శుల వరకు పలువురు మద్దతు పలికారు.

అయితే ఉదయనిధికి మంత్రి పదవి ఇస్తే కుటుంబ రాజకీయాలనే విమర్శలకు బలం చేకూరుతుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భావించినట్లు సమాచారం.అయితే ఇప్పుడు ఉదయనిధికి మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ వర్గీయులే కాకుండా కుటుంబ సభ్యులు కూడా పట్టుబట్టడంతో స్టాలిన్ దీనిపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.క్రీడల అభివృద్ధి, యువజన సంక్షేమ శాఖ, ప్రత్యేక ప్రాజెక్టు అమలు శాఖలను ఉదయనిధి స్టాలిన్‌కు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఉదయనిధి లేదా స్టాలిన్ డిసెంబర్ 14న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఉదయనిధి స్టాలిన్‌ ప్రస్తుతం చెన్నైలోని చెపాక్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నటుడిగా, నిర్మాతగా, పంపిణీదారుగా రాణించిన ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం ఫుల్ టైమ్హపొలిటీషియన్ గా ఉన్నారు.

Exit mobile version