Site icon Prime9

Delhi: ఢిల్లీలో ఇద్దరు మహిళలను కాల్పిచంపిన దుండగులు

Delhi

Delhi

Delhi: ఢిల్లీలోని ఆర్ కె పురం అంబేద్కర్ బస్తీ ప్రాంతంలో ఆదివారం ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. నిందితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వారిని అర్జున్ మరియు మైఖేల్‌గా గుర్తించారు. బాధితుల సోదరుడితో వారికి ఆర్థిక వివాదం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్దిక లావాదేవీలే ..(Delhi)

ప్రాథమిక విచారణ ప్రకారం ఈ కేసు మనీ సెటిల్‌మెంట్ సమస్యకు సంబంధించిందని తెలుస్తోంది. మృతులను పింకీ (30), జ్యోతి (29)గా గుర్తించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది పింకీ, జ్యోతి అనే ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపినట్లు గుర్తించారు. అనంతరం మహిళలను ఢిల్లీలోని ఎస్‌జే ఆస్పత్రికి తరలించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘటనపై స్పందించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శాంతి భద్రతలు మరియు ఢిల్లీ గురించి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. దేశ రాజధానిలో ప్రజలు సురక్షితంగా లేరని రాశారు.మా ఆలోచనలు ఇద్దరు మహిళల కుటుంబాలతో ఉన్నాయి. వారి ఆత్మకు శాంతి కలుగుగాక. ఢిల్లీ ప్రజలు తీవ్ర అభద్రతా భావానికి లోనయ్యారు. ఢిల్లీలో శాంతిభద్రతలను చక్కదిద్దాల్సిన వ్యక్తులు, శాంతిభద్రతలను చక్కదిద్దే బదులు, మొత్తం ఢిల్లీ ప్రభుత్వాన్ని కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ఈరోజు ఢిల్లీ శాంతిభద్రతలు లెఫ్టినెంట్ గవర్నర్ కు బదులు ఆప్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే ఢిల్లీ అత్యంత సురక్షితంగా ఉండేదని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు.

Exit mobile version
Skip to toolbar