Site icon Prime9

Prajwal Revanna: నిజం నిలకడమీదనే తెలుస్తుంది! ..ఎంపీ ప్రజ్వల్ రేవన్న

prajwal Revanna

prajwal Revanna

Prajwal Revanna: కర్ణాటకలో ప్రస్తుతం ప్రజ్వల్‌ రేవన్న సెక్స్‌ స్కాండిల్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే స్కాండిల్‌ వెలుగు చూసిన వెంటనే ప్రజ్వల్‌ దేశం నుంచి జర్మనీకి పారిపోయాడు. విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్‌ తొలిసారి ఒక ప్రకటన విడుదల చేశాడు. వాస్తవాలు నిలకడగా వెలుగు చూస్తాయని, తాను అమాయకుడినని ప్రకటనలో పేర్కొన్నాడు. తాను బెంగళూరులో లేనందున సీఐడి విచారణకు హాజరుకాలేనని, తన తరఫున తన అడ్వకేట్‌ హాజరు అవుతారని ప్రకటనలో తెలిపాడు. తన లేఖను ప్రజ్వల్‌ ఎక్స్‌ లో పోస్ట్‌ చేశాడు.

ప్రజ్వల్ డ్రైవర్ పెన్ డ్రైవ్ నుంచి…(Prajwal Revanna)

ఇదిలా ఉండగా ప్రజ్వల్‌ మాజీ డ్రైవర్‌ కార్తీక్‌ నుంచి సిట్‌ అధికారులు ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్‌ నుంచి డేటాతో పాటు అసభ్యకరమైన వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక బీజేపీ నాయకుడు లాయర్‌ దేవరాజ్‌ గౌడకు ప్రజ్వల్‌ సెక్స్‌ వీడియో క్లిప్‌ల పెన్‌ డ్రైవ్‌లను అందజేశాడు. ఈ పెన్‌ డ్రైవ్‌ అందుకున్న దేవరాజ్‌ గౌడ్‌ వెంటనే బీజేపీ అధిష్టానానికి వచ్చే లోకసభ ఎన్నికల్లో జెడీఎస్‌తో పొత్తు వద్దని వారించాడు. ప్రజ్వల్‌పై లైంగిక దాడులకు టేప్‌ గురించి బీజేపీ అధిష్టానానికి సమాచారం అందించాడు. అయితే బీజేపీ నాయకత్వం మాత్రం దేవరాజ్‌ గౌడ నుంచి తమకు ఎలాంటి లేఖ రాలేదని చెబుతోంది.

వేధింపులకు గురిచేసినందుకే..

ఇక ప్రజ్వల్‌ రెవన్న డ్రైవర్‌ కార్తీక్‌ విషయానికి వస్తే తాను ఏడాది క్రితమే ప్రజ్వల్‌ వద్ద డ్రైవర్‌గా పనిమానేశానని చెప్పాడు. తన భార్యతో పాటు తనపై కూడా దాడి చేశారని.. తన భూములు లాక్కున్నారని కార్తీక్‌ ఆరోపిస్తున్నాడు. కాగా లాయర్‌ దేవరాజ్‌ గౌడ్‌ హెచ్‌ డీ దేవెగౌడ కుటుంబంతో న్యాయపోరాటం చేస్తున్న క్రమంలో తాను ఆయనను కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి.. తన వద్ద ఉన్న పెన్‌ డ్రైవ్‌ ఇచ్చానని చెప్పాడు కార్తీక్‌. అయితే ప్రజ్వల్‌ కోర్టుకు వెళ్లి వీడియోలు విడుదల కాకుండా స్టే తెచ్చుకున్నాడు. అయితే తాను కాంగ్రెస్‌ పార్టీ వారికి మాత్రం పెన్‌ డ్రైవ్‌ ఇవ్వలేదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా తాను సిట్‌ ముందు హాజరై ప్రజ్వల్‌ ఇంట్లో పనిమనుషులపై జరిగిన అత్యాచారల గురించి చెబుతానని కార్తీక్‌ అన్నాడు. ఇదిలా ఉండగా జనతాదళ్‌ సెక్యూలర్‌ ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. సెక్స్‌ టేపులపై సిటి దర్యాప్తు జరిపి నివేదిక వచ్చే వరకు ఆయన సస్పెన్షన్స్‌ కొనసాగుతుంది. ఇదిలా ఉండగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాసిన లేఖలో సెక్స్‌ స్కాండిల్‌లో పాల్గొన్న ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

 

Exit mobile version