Site icon Prime9

Tihar Jail: తీహార్ జైలులో 80 మంది అధికారుల బదిలీ..

Tihar Jail

Tihar Jail

Tihar Jail: తీహార్ జైలులో ఇద్దరు గ్యాంగ్ స్టర్లు ప్రత్యర్దుల దాడిలో మరణించిన తరువాత భద్రతా ఏర్పాట్లపై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తిన నేపధ్యంలో జైళ్ల శాఖ భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా 80 మంది అధికారులను బదిలీ చేశారు.

బదిలీ అయిన అధికారుల్లో ఐదుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు, తొమ్మిది మంది అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఎనిమిది మంది హెడ్ వార్డెన్లు, 58 మంది వార్డెన్లు ఉన్నారు. వీరిలో కొంతమంది అధికారులను తీహార్ జైలు నుంచి మండోలికి పంపారు. ఈ బదిలీలతో కలిపి మొత్తం 171 మంది అధికారులను తరలించారు.ఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్ బెనివాల్, జైలు సీనియర్ అధికారి ఆదేశాల మేరకు గురువారం బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఫుల్ బాడీ ప్రొటెక్టర్లు, పెప్పర్ స్ప్రేలు..(Tihar Jail)

భద్రతా సిబ్బంది మరియు సీసీటీవీ కెమెరాల ఉన్నప్పటికీ ప్రత్యర్థి ముఠా చేసినదాడిలో భయంకరమైన గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా మరణించిన విషయం తెలిసిందే.మే 2న తీహార్ జైలులో 33 ఏళ్ల తాజ్‌పురియాను ప్రత్యర్థి గోగీ గ్యాంగ్‌లోని నలుగురు సభ్యులు దారుణంగా హతమార్చిన సంఘటనను అధికారులు తీవ్రంగా పరిగణించారు, ఇది విషయాలను క్రమబద్ధీకరించడానికి ప్రేరేపించింది. దీనితో కింది స్దాయి నుంచి భారీ మార్పులు అవసరమని భావించారు. ఈ నేపధ్యంలో పెద్ద ఎత్తున బదిలీలకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు ప్రాణాలకు హాని కలిగించకుండా నేరస్తులను లొంగదీసుకోవడానికి ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రారంభ దశలో, మూడు జైలు సముదాయాల్లో 80 ఎలక్ట్రిక్ షాక్ లాఠీలు (టేజర్లు), 160 ఫుల్ బాడీ ప్రొటెక్టర్లు, 80 పెప్పర్ స్ప్రేలు మరియు 160 T లాఠీలు కొనుగోలు చేస్తారు.

జైళ్లలో భద్రతా చర్యలను పెంపొందించే ప్రయత్నంలో, ఖైదీల పర్యవేక్షణ కోసం బయోమెట్రిక్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేంద్ర జైళ్లను ఆదేశించింది, అంతేకాదు.. జైలు నిర్వహణ మరియు భద్రతా బాధ్యతలను వేరు చేయడానికి హైబ్రిడ్ మోడల్‌ను అన్వేషించాలని మంత్రిత్వ శాఖ కోరింది.

 

Exit mobile version
Skip to toolbar