CM Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తమిళనాడును నీట్ నుండి మినహాయించకపోవడంపై కేంద్రంపై మండిపడ్డారు. విద్యను రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాకు మార్చితేనే NEET పరీక్షను తొలగించగలమని స్టాలిన్ అన్నారు.
సెయింట్ జార్జ్ ఫోర్ట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరియు ముఖ్యంగా మహిళా సాధికారత కోసం తమిళనాడు ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువచ్చిందని అన్నారు. ప్రజలకు నేరుగా సంబంధించిన అంశాలను రాష్ట్ర జాబితాకు కేటాయించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విద్యను మళ్లీ రాష్ట్ర జాబితాకు ( ఉమ్మడి జాబితానుంచి) తరలించాలని, అప్పుడే NEET వంటి పరీక్షలను పూర్తిగా తొలగించగలమని స్టాలిన్ అన్నారు.
నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని..(CM Stalin)
రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు మరియు బాధ్యతల పంపిణీని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఏడవ షెడ్యూల్‌లో, పాత్రలు మరియు బాధ్యతలు మూడు జాబితాలుగా విభజించబడ్డాయి. యూనియన్ జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా.యూనియన్ జాబితాలో 97 సబ్జెక్టులు ఉన్నాయి. రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలో వరుసగా 61 మరియు 52 సబ్జెక్టులు ఉన్నాయి. తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ NEET పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించే చట్టాన్ని ఆమోదించింది.