Site icon
Prime9

Kashmir Terror Attack : జేడీ వాన్స్‌ పర్యటన సందర్భంగా కశ్మీర్‌లో ఉగ్రదాడి.. గుర్తుచేసిన నాటి అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ సందర్శన

Kashmir Terror Attack

Kashmir Terror Attack

Kashmir Terror Attack : అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో మంగళవారం ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మృతిచెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

 

2000లో బిల్ క్లింటన్ భారత్‌లో పర్యటన..
అగ్రరాజ్యం అగ్ర నేత ఇండియాను సందర్శించిన సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడడం ఇది రెండోసారి. 2000 సంవత్సరం మార్చిలో నాటి అగ్రరాజ్యం అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ఇండియాలో పర్యటించారు. ఈ క్రమంలో మార్చి 20వ తేదీన అనంత్‌నాగ్ జిల్లాలోని చిట్టిసింగ్‌పోరా మారుమూల గ్రామాన్ని ఉగ్రవాదులు చుట్టుముట్టారు. రాత్రి 7.20 గంటల సమయంలో భారత్ ఆర్మీ యూనిఫారం ధరించిన ఉగ్రవాదులు సిక్కులు నివసించే గ్రామంలోకి ప్రవేశించారు. ఆపిల్ తోటలు, పొలాల్లో నుంచి నిశ్శబ్దంగా చేరుకున్నారు.

 

సిక్కు వర్గమే లక్ష్యంగా..
మరోవైపు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు కొవ్వొత్తులు, లాంతర్లు వెలిగించారు. నాటి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ఇండియా మొదటి పర్యటన గురించిన వార్తలను రేడియోలో వింటున్నారు. కొందరు గురుద్వారాల్లో సాయంత్రం ప్రార్థనల తర్వాత తమ ఇళ్లకు చేరుకున్నారు. సిక్కు ప్రజలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఉగ్రవాదులు గుంపులుగా విడిపోయి ప్రార్థనా స్థలాలు, దుకాణాలు, ఇంటి వద్ద ఉన్న సిక్కు పురుషులను చుట్టుముటి, 37 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారిని ఒకచోట చేర్చి కాల్చి చంపారు. ఇందులో 35 మంది సిక్కులు మృతిచెందగా, ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. జమ్ముకశ్మీర్‌లో ఏళ్లుగా కొనసాగుతున్న ఉగ్ర దాడుల్లో ప్రత్యేకంగా సిక్కు వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇదేతొలిసారి.

 

 

Exit mobile version
Skip to toolbar