Site icon Prime9

Sonia Gandhi’s comments: ఇది రాజీవ్ గాంధీ కల.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ కామెంట్స్

Sonia Gandhi

Sonia Gandhi

 Sonia Gandhi’s comments: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌కోటాతో కూడిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ గురువారం మద్దతు తెలిపారు:కాంగ్రెస్ తరపున లోక్ సభ లో బిల్లుపై చర్చను ప్రారంభించిన సోనియా గాంధీ, మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడంలో జాప్యం చేస్తే భారతీయ మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.  అన్ని అడ్డంకులను తొలగించి, సాధ్యమయ్యే అన్ని అడ్డంకులను తొలగించి, మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయండని అన్నారు.

15 లక్షల మంది మహిళా నాయకులు..( Sonia Gandhi’s comments)

ఆమె తన ప్రసంగంలో, బిల్లును మొదట తన భర్త మరియు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని తెలిపారు. ఇది నా జీవితంలో కూడా ఒక ఉద్వేగభరితమైన క్షణం. తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించే రాజ్యాంగ సవరణను నా జీవిత భాగస్వామి రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు. రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో ఓడిపోయిందన్నారు. తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు నేతృత్వంలో రాజ్యసభలో ఆమోదించింది. ఫలితంగా, స్థానిక సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళా నాయకులు ఎన్నికయ్యారు. రాజీవ్ గాంధీ కల పాక్షికంగా మాత్రమే పూర్తయింది. ఈ బిల్లు ఆమోదంతో అది పూర్తవుతుందని ఆమె తన ప్రసంగంలో చెప్పారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో సరోజినీ నాయుడు, అరుణా అసఫ్ అలీతో సహా వివిధ మహిళా నాయకుల పాత్రను కూడా ఆమె గుర్తు చేసారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా మంగళవారం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.’నారీ శక్తి వందన్ అధినియం’ అనే బిల్లు లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తుంది.2026 తర్వాత మొదటి జనాభా గణన తర్వాత నిర్వహించబడే తదుపరి డీలిమిటేషన్తర్వాత ఈ చట్టం అమలులోకి వస్తుంది.

Exit mobile version