Site icon Prime9

Radhika Khera : కాంగ్రెస్‌ పార్టీలో మహిళలకు గౌరవం లేదు.. రాధికా ఖేరా సంచలన ఆరోపణలు

Radhika khera

Radhika khera

Radhika Khera : కాంగ్రెస్‌ పార్టీలో మహిళలకు గౌరవం లేదని మాజీ కాంగ్రెస్‌ నాయకురాలు రాధికా ఖేరా అన్నారు. కాగా ఆమె ఆదివారం నాడు కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనపై చత్తీస్‌గఢ్‌ యూనిట్‌ మీడియా చైర్మన్‌ సుశీల్‌ ఆనంద్‌ శుక్లా తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. మాజీ కాంగ్రెస్‌ నాయకురాలు సోమవారం నాడు చత్తీస్‌గఢ్‌ యూనిట్‌ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు.

లైంగిక వేధింపులు..(Radhika Khera)

చత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ మీడియా చైర్మన్‌పై సుశీల్‌ ఆనంద్‌ శుక్లా తనతో అమర్యాదకరంగా ప్రవర్తించడంతో పాటు తనను లైంగికంగా వేధించారని ఆమె అన్నారు. తన పట్ల దుర్బాషలాడుతుండా తాను ఫోన్‌లో రికార్డింగ్‌ చేయడానికి ప్రయత్నించినప్పుడు శుక్లా తన ఇద్దరు అనచురులను పిలిచి తలుపులు వేయాల్సిందిగా ఆదేశించాడు. తనను బయటికి వెళ్లడానికి అనుమతించలేదు. నోటితో చెప్పలేని విధంగా బండబూతులు తిట్టాడని ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.గదిలో ఉన్న ముగ్గురు వ్యక్తులు తన దగ్గరకు వచ్చారు. తాను లోపల నుంచి తలుపు తీయండి అని బిగ్గరగా అరిచినా.. ఏ ఒక్కరు తనకు సాయం చేయడానికి ముందుకు రాలేదన్నారు. తానే బలవంతంగా తలుపు నెట్టి తోసుకొని పరుగెత్తుకుంటూ వచ్చి చత్తీస్‌గడ్‌ రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగదిలోకి వెళ్లి ఫిర్యాదు చేద్దామనుకుంటే ఆయన స్పందించలేదు. పార్టీ కార్యాలయంలో ఏ ఒక్క వ్యక్తి తనకు అండగా నిలువలేదు. ఏమైందని ఏ ఒక్కరు అడగలేదు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. అదే కాకుండా రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర సందర్భంగా శుక్లా తనకు మద్యం ఆఫర్‌ చేశారని, తాను గదిలో పడుకున్నప్పుడు ఐదు, ఆరుమంది మద్యం మత్తులో తన గది తలుపులు కొట్టారని ఆమె ఆరోపించారు.

అయోధ్యకు వెళ్లానని కక్ష గట్టారు..

ఈ సంఘటనకు సంబంధించి సచిన్‌ పైలెట్‌, జైరాం రమేశ్‌కు చెప్పినా.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వీరంతా తనకు అండగా ఎందుకు ఉండటం లేదని ఆలోచించగా.. తాను అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాత శ్రీరాముడిని దర్శించుకోవడానికి వెళ్లినందుకు తనకు వ్యతిరేకంగా వీరంతా ముఠా కట్టారని అన్నారు. ఇక ఖేరా విషయానికి వస్తే ఆమె తరచూ టెలివిజన్‌ చానల్స్‌లో కాంగ్రెస్‌ అధికారప్రతినిధిగా మాట్లాడుతుంటారు. అయోధ్యలో రామమందిరం సందర్శించుకున్న తర్వాత తన ఇంటిపై జై శ్రీరాం ఫ్లాగ్‌ రెపరెపలాడ్డం కాంగ్రెస్‌ పార్టీకి నచ్చలేదని ఆమె అన్నారు. తాను ఫోటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తే కాంగ్రెస్‌ నాయకులు తనను ఎందుకు పోస్ట్‌ చేశావని తిట్టేవారు. ఎన్నికల సమయంలో అయోధ్యకు ఎందుకు వెళ్లావని తనను మందలించేవారని ఆమె వాపోయారు. కాంగ్రెస్‌ పార్టీ హిందు వ్యతిరేక పార్టీ అని ఆమె అన్నారు.

ఇక చివరిగా ఆమె రాహుల్‌తో పాటు ప్రియాంకా గాంధీపై కూడా ధ్వజమెత్తారు. గత మూడు సంవత్సరాల నుంచి ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. భారత్‌ జోడో న్యాయయాత్ర సందర్భంగా ఏదో నామ్‌కే వాస్తే అన్నట్లు ఐదు నిమిషాల పాటు చేతులు ఊపి తన ట్రైలర్‌లో పోయి పండుకునే వారు. ప్రియాంకా గాంధీ కూడా తనను కలవడానికి ఇష్టపడలేదన్నారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తగా గత రెండు దశాబ్దాల పాటు పార్టీకి సేవలందించినా.. చివరకు తనకు చివరికి అవమానాలే మిగిలాయని రాధికా ఖేరా ఆవేదన వ్యక్తం చేశారు.

 

Exit mobile version