Prime9

Covid- 19: దేశంలో తగ్గని కరోనా ఉధృతి.. భారీగా కేసుల నమోదు

Corona Virus: దేశంలో కరోనా వైరస్ ఉధృతి అదుపులోకి రావడం లేదు. రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. దీంతో పెద్ద సంఖ్యలో పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో ఈ ఏడాది కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 6 వేలను దాటింది. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 358 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 6,491కి చేరింది. అయితే గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించకపోవడం ఊరట కలిగించే అంశం.

కాగా కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలో 144 కేసులు వెలుగు చూడగా, గుజరాత్ లో 105, పశ్చిమ బెంగాల్ లో 71 కేసులు బయటపడ్డాయి. ఇక ఏడాది దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 65 కి చేరింది. మరోవైపు కేరళ, ఢిల్లీ, గుజరాత్, బెంగాల్, కర్ణాటక, తమిళనాడులో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు కేరళలో 1957 కేసులు బయటపడగా.. గుజరాత్ లో 980, వెస్ట్ బెంగాల్ 747, ఢిల్లీ 728, మహారాష్ట్ర 607 ఏపీ 85, తెలంగాణలో 10 కేసులు బయటపడ్డాయి.

Exit mobile version
Skip to toolbar