Site icon Prime9

Firozabad : అంత్యక్రియల వేళ కళ్లు తెరిచిన మహిళ…

Women

Women

Firozabad : ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చనిపోయిందనుకున్న మహిళ అంత్యక్రియల వేళ కళ్లు తెరిచింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఓ వృద్ధ మహిళ చనిపోయిందని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే శ్మశానవాటికకు తీసుకువెళుతుండగా వృద్ధురాలు ఒక్కసారిగా కళ్లు తెరిచింది. దీనితో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతున్న హరిభేజీ అనే 81 ఏళ్ల వృద్ధురాలు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించిన తర్వాత ఈ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్తుండగా, ఆమె ఒక్కసారిగా కళ్లు తెరిచి అందరినీ షాక్‌కు గురి చేసింది.

ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకువచ్చి టీ కూడ తాగించారు.కానీ ఆమె ప్రాణాలు ఎక్కువ సేపు నిలవలేదు. మరుసటి రోజు ఆమె మరణించింది. డిసెంబర్ 23న ఆమెను ఫిరోజాబాద్‌లోని ట్రామా సెంటర్‌లో చేర్పించారు.తరువాత ఆమె మెదడు పనిచేయడం ఆగిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అయితే శ్మశాన వాటికకు తీసుకెళ్తుండగా ఆమె కళ్లు తెరిచింది. డాక్టర్లు చనిపోయిందని డిక్లేర్ చేసిన తర్వాత 24 గంటల పాటు బతికిన హరిభేజి.. మరుసటి రోజు మరణించింది.

Exit mobile version
Skip to toolbar