Site icon Prime9

current Bill: కరెంట్ బిల్లు కట్టం.. కాంగ్రెస్ నుంచి తీసుకోండి అంటున్న గ్రామస్థులు.. ఎక్కడో తెలుసా?

current Bill

current Bill

current Bill:  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో కర్ణాటకలోని చిత్రదుర్గ గ్రామస్థులు విద్యుత్ బిల్లులు చెల్లించడంలేదని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా సోమవారం తెలిపారు. దీనికి సంబంధించి మాల్వియా ఒక వీడియోను పంచుకున్నారు.

కాంగ్రెస్ నుంచి తీసుకోండి..(current Bill)

ప్రజలు విద్యుత్ బిల్లు చెల్లించడానికి నిరాకరిస్తున్నారని మరియు అలా చేయవద్దని ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ తమకు ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే బిల్‌ కలెక్టర్‌కు చెబుతున్నారు.. వెళ్లి వాళ్ల (కాంగ్రెస్‌) నుంచి తీసుకోండి అంటున్నారని మాల్వియా అన్నారు. త్వరలో ముఖ్యమంత్రిని ప్రకటించండి. లేకపోతే చుట్టూ గందరగోళం ఉంటుంది అని ఆయన ట్వీట్ చేసారు. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తదుపరి ముఖ్యమంత్రిని ఇంకా ప్రకటించలేదు.

ద్రవ్యలోటు పెరుగుతుంది..

ప్రస్తుతం కర్ణాటక మొత్తం రాబడి రూ.2.26 లక్షల కోట్లు కాగా, ఖర్చు రూ.2.87 లక్షల కోట్లు అని మాల్వియా తెలిపారు. 5 హామీలతో, ద్రవ్య లోటు GSDPలో 1.14 లక్షల కోట్లకు లేదా 4.8 శాతానికి (ప్రస్తుతం రూ. 60,582 కోట్లు లేదా GSDPలో 2.6 శాతం నుండి) పెరుగుతుందని ఆయన అన్నారు. తొలి కేబినెట్‌ సమావేశంలో దీనిని ఆమోదించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందన్నారు. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్ లేదా కర్ణాటకలో హిమాచల్‌లో మాదిరి కాంగ్రెస్ తన మాటలను వెనక్కి తీసుకోదని ఆశిస్తున్నారని మాల్వియా అన్నారు.

ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌..

కర్ణాటకలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం నమోదు చేసిన అనంతరం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ఐదు హామీలను పాత పార్టీ నెరవేరుస్తుందని ఆ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు మాకు రికార్డు స్థాయిలో ఓట్లు వేశారని.. మేం మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత మా మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మొత్తం 5 హామీలను అమలు చేస్తామని ఖర్గే ఆదివారం అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి కేబినెట్ సమావేశంలోనే తమ ప్రభుత్వం 5 హామీలను నెరవేరుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పార్టీ పట్టుదలతో పనిచేస్తుందని అన్నారు.

Exit mobile version