Site icon Prime9

Supreme Court : స్వాతంత్య్ర సమరయోధులను అపహాస్యం చేయొద్దు : రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్

Supreme Court

Supreme Court

Supreme Court : స్వాతంత్య్ర సమరయోధులను అపహాస్యం చేయొద్దని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు శుక్రవారం సీరియస్ అయింది. వీర్ సావర్కర్‌ను ఉద్దేశించి గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలను కొనసాగిస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇవే తరహా వ్యవహరిస్తే తామే స్వయంగా విచారణ చేపడుతామని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం మండిపడింది.

 

 

వీర్ సావర్కర్ ఆంగ్లేయుల సర్వెంట్ అని రాహుల్ ఆరోపించారు. బ్రిటీష్ ప్రభుత్వం నుంచి పింఛన్ పొందారని 2022 సంవత్సంలో రాహుల్ తన భారత్ జోడో యాత్రలో ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది నృపేంద్ర పాండే లక్నో మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. 2024 డిసెంబర్ 12వ తేదీన లక్నో మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్‌ గాంధీకి సమన్లు జారీ చేసింది. సమన్లను రాహుల్ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను రద్దు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పుపై రాహుల్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఫిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది.

 

ఈ విషయం మీ క్లయింట్‌కు తెలుసా?
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సావర్కర్‌ను మహారాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారు. ఇప్పుడు మీరు సావర్కర్‌ను బ్రిటీష్ వారి సేవకుడు అంటారు. తర్వాత మరెవరో మహాత్మగాంధీ బ్రిటీషర్లకు సర్వెంట్ అంటారు. స్వాతంత్ర్య సమర యోధులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడానికి తాము ఎవరికి అనుమతి ఇవ్వమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మహాత్మ గాంధీ కూడా బ్రిటీష్ వారితో ‘మీ నమ్మకమైన సేవకుడిని’ అనే పదాలను ఉపయోగించారని మీ క్లంయిట్‌కు తెలుసా? మీ క్లయింట్ నానన్న ఇందిరా గాంధీ కూడా స్వాతంత్ర్య సమరయోధుడిని ప్రశంసిస్తూ లేఖ పంపిందని తెలుసా? అని రాహుల్ తరఫున విచారణకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు, లాయర్ అభిషేక్ సింగ్వీని కోర్టు ప్రశ్నించింది.

 

వారు మనకు స్వేచ్ఛను ప్రసాదించారు. సావర్కర్ విషయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం అని పేర్కొంది. మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు రిపీట్ చేయొద్దని కోర్టు హెచ్చరించింది. చట్టం గురించి మంచి అభిప్రాయం ఉన్నందున మీకు మెటిజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం స్టే ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది.

 

 

 

 

 

 

Exit mobile version
Skip to toolbar