Essay Competition : పాక్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. ఈ నేపథ్యంలో రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి యువత మనసులోని భావాలను వినిపించేందుకు ఒక అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నెల 1వ తేదీ నుంచి 30వరకు వ్యాసరచన పోటీ అందుబాటులో ఉంటుంది. ఒకరు ఒకేసారి పోటీల్లో పాల్గొనవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో వ్యాసరచనం రాసేందుకు మాత్రమే వీలుటుంది. 500 నుంచి 600 పదాల్లోనే ఉండాలి. ఇందులో ముగ్గురు విజేతలకు రూ.10వేల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. దీంతోపాటు టాప్‌లో నిలిచిన 200 మందికి (వీరికి తోడుగా మరొకరికి) ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఇందుకోసం mygov.inలో లాగిన్ అయి వ్యాసరచన పోటీల్లో పాల్గొనవచ్చు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాక్‌తోపాటు పీవోకేలో 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. వీటితోపాటు పలు పాకిస్థాన్ వైమానికి స్థావరాలను కూడా తీవ్రంగా దెబ్బకొట్టింది. సీమాంతర ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న భారత ప్రధాని మోదీ సరికొత్త పంథాలో పాక్ ఉగ్రవాదానికి ఒక ‘రైడ్‌లైన్’ గీశామని ఉద్ఘాటించారు.