Committee Recommendation: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సును తగ్గించాలని పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసు చేసింది. దీనివల్ల యువతకు ప్రజాస్వామ్యంలో నిమగ్నమయ్యేందుకు సమాన అవకాశాలు లభిస్తాయని పేర్కొంది.
ప్రస్తుతం అభ్యర్థి లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి కనీసం 25 ఏళ్ల వయస్సు ఉండాలి.రాష్ట్రాల రాజ్యసభ మరియు శాసనమండలికి ఎన్నిక కావడానికి 30 సంవత్సరాలు ఉండాలి. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు లభిస్తుంది.లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసేందుకు కనీస వయస్సును ప్రస్తుతం ఉన్న 25 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించాలని శుక్రవారం ప్యానెల్ సిఫారసు చేసింది.కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు ఆస్ట్రేలియా వంటి వివిధ దేశాల పద్ధతులను పరిశీలించిన తర్వాత, జాతీయ ఎన్నికలలో అభ్యర్థిత్వానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలని కమిటీ గమనించింది. ఈ దేశాల ఉదాహరణలు యువకులు విశ్వసనీయంగా మరియు బాధ్యతాయుతంగా ఉంటారని నిరూపించాయని బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ నేతృత్వంలోని లా అండ్ పర్సనల్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొంది.
అసెంబ్లీ ఎన్నికలలో కూడా అభ్యర్థిత్వానికి కనీస వయోపరిమితిని తగ్గించాలని కమిటీ సూచించింది.ఈ చర్య యువతకు ప్రజాస్వామ్యంలో నిమగ్నమయ్యేందుకు సమాన అవకాశాలను అందిస్తుందని తెలిపింది.ఫిన్లాండ్ యొక్క పౌరసత్వ విద్య వంటి ఇతర దేశాల నుండి విజయవంతమైన నమూనాలను పరిగణించవచ్చు మరియు తదనుగుణంగా వాటిని స్వీకరించవచ్చని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది.