Police Medals:స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసులకు పతకాలను.ప్రకటించింది. 229 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 82 మంది పోలీసులకు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు , 642 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలను ప్రకటించింది. జమ్మూకశ్మీర్ నుంచి 55 మంది పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్నారు.మహారాష్ట్ర నుంచి 33, సీఆర్పీఎఫ్ నుంచి 27, ఛత్తీస్‌గఢ్ నుంచి 24 మందికి పీఎంజీ పతకాలు దక్కాయి. అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు పతకం . సీఆర్పీఎఫ్ అధికారి లౌక్రక్‌పామ్ ఇబోంచా సింగ్ కు దక్కింది.
తెలుగు రాష్ట్రాలనుంచి 63 మంది..(Police Medals)
ఏపీ నుంచి 29 మందికి ఈ పతకాలు దక్కాయి. 18 మందికి పోలీస్ గ్యాలంటరీ పతకాలు, ఒకరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు అందుకోనున్నారు. ఇక తెలంగాణ నుంచి 34 మంది ఈ పతకాలకు ఎంపికయ్యారు. 22 మందికి పోలీస్ గ్యాలంటరీ, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు, మరో ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి.