Site icon Prime9

Tv Remote Fight: రిమోట్ రచ్చ.. అత్త వేళ్లు కొరికేసిన కోడలు..!

viral-news-thane

Viral News: ఇళ్లన్నాక గొడవలు సహజం. అందులోనూ అత్తాకోడళ్లు అయితే మరి చెప్పనక్కర్లేదు. అత్తాకోడళ్ల మధ్య పచ్చిగడ్డి వేసిన భగ్గుమంటుంది అన్న నానుడి ఊరికే రాలేదండోయ్. కొన్ని కలహాలు కుటుంబాన్ని చీల్చితే, మరికొన్ని ప్రాణాలను కూడా తీస్తుండడం మనం ఇటీవలె కాలంలో చూస్తూనే ఉన్నాం. ఆడవాళ్లు టీవీ ప్రియులు, మరి టీవీ చూడాలంటే రిమోట్ కావాలి కదా. సడెన్ గా టాపిక్ మార్చానేంటా అనుకుంటున్నారా సంబంధం ఉందండి. ఈ చిన్న టీవీ రిమోటే ఆ అత్తాకోడళ్ల మధ్య చిచ్చుపెట్టి, అత్త చేతి వేళ్లు కొరికేసేలా చేసింది. ఈ ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురించేసింది.

మహారాష్ట్ర, తానేలో విజయ కులకర్ణి (32) తన భర్త, అత్త వృషాలితో కలిసి నివాసం ఉంటుంది. కాగా ఈ ఇద్దరి అత్తాకోడళ్లకు అస్సలు పడదు. తరచూ విజయ, తన అత్త వృషాలితో గొడవపడుతూ ఉండేది. అయితే తాజాగా వృషాలి పూజ చేసుకుంటుండగా కోడలు విజయ టీవీ చూస్తూ సౌండ్ ఎక్కువగా పెట్టి ఎంజాయ్ చేస్తుంది. టీవీ సౌండ్ తగ్గించమని వృషాలి విజయకు ఎన్నిసార్లు చెప్పినా ఆమె పట్టించుకోలేదు. దానితో అసహనానికి గురైన వృషాలి కోడలు విజయ చేతిలో ఉన్న రిమోట్ ని లాక్కొని సౌండ్ తగ్గించడానికి ప్రయత్నించింది. దానితో ఆగ్రహానికి గురైన కోడలు విజయ అత్త చేతి వేళ్లను కొరికేసింది. దానితో బాధితురాలు కోడలు విజయ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version