Prime9

Technical Issue in Air India: భయపెడుతున్న ఎయిర్ ఇండియా విమానాలు.. మరొకదానిలో సమస్య!

Technical Issue in San Francisco to Mumbai Air India Flight: దేశంలో ప్రస్తుతం ఎయిర్ ఇండియా పేరు చెప్తేనే విమాన ప్రయాణికులు అమ్మో అనే పరిస్థితి వచ్చింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన తర్వాత రోజూ ఏదో ఒక చోట విమానాలకు సమస్యలు, చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అదృష్టం బాగుండి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఒకవేళ అలాంటి చిన్న చిన్న సమస్యలు, ప్రమాదాలే పెద్దవిగా మారితే.. అహ్మదాబాద్ విమాన ప్రమాదం లాగా భారీ మూల్యం చెల్లించుకోవల్సిందే. గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఇలాంటి ఘటనలతో ప్రయాణికులు విమానం ఎక్కాలంటేనే భయపడే పరిస్థితులు వస్తున్నాయి.

 

తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్ కతా మీదుగా ముంబై వస్తున్న ఏఐ 180 విమానంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో ఇవాళ తెల్లవారుజామున విమానాన్ని కోల్ కతాలో నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. విమానం ఇంజన్లలో ఒకటి పనిచేయడం లేదని, దీంతో విమానం ఎగరడంలో ఇబ్బందులు తలెత్తాయని అధికారులు తెలిపారు. కనుక విమానం ముంబై వెళ్లేందుకు మరింత ఆలస్యం కానుందని చెప్పారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Exit mobile version
Skip to toolbar