NEET OMR Sheet: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, (నీట్) పరీక్ష సందర్బంగా తన ఒఎంఆర్ షీటును పాడుచేసి ఇబ్బందిపెట్టినందుకు దిశా శర్మ అనే యువతి పరీక్ష ఇన్విజిలేటర్‌పై రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి వివరాలివి.
రాజస్థాన్‌లోని బస్సీ టౌన్‌కు చెందిన 18 ఏళ్ల దిశా శర్మ, మే 7 న జైపూర్‌లోని రామనగరీయ ప్రాంతంలోని వివేక్ టెక్నో స్కూల్‌లో నీట్ 2023కి హాజరయింది. ఆమె పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు షెడ్యూల్ చేయబడింది. ఇన్విజిలేటర్ టీ కప్పు తీసుకుని పరీక్ష హాలులో తిరుగుతున్నాడు. పొరపాటున కప్పులోని టీ దిశా ఒఎంఆర్ షీట్ పై పడింది. దీనితో మొత్తం 17 ప్రశ్నలకు సమాధానాలు మిస్ అయ్యాయి.ఇన్విజిలేటర్ ఆమె సమాధానాలను తిరిగి వ్రాయమని అడిగారు అయితే పరీక్ష పత్రాన్ని పూర్తి చేయడానికి ఆమెకు అదనపు సమయం ఇవ్వలేదు.
చివరకు ఆమె ఇన్విజిలేటర్‌ను కేవలం 5 నిమిషాలు మాత్రమే అడగినా అతను ఆమె చేతిలోని ఓఎంఆర్ షీట్ లాక్కున్నాడు. పరీక్ష ముగిసిన తర్వాత, దిశ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ అతను స్పందించలేదు. ఆమె అభ్యర్థనలను పట్టించుకోలేదు. ఈ సంఘటన తర్వాత దిశా, ఆమె కుటుంబ సభ్యులు రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ అనిల్ ఉప్మాన్‌లతో కూడిన డివిజనల్ బెంచ్ దిశా ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ మరియు పూర్తి రికార్డును సబ్మిట్ చేాయాలని సమన్లు చేసింది. పరీక్షా కేంద్రం నుంచి తరగతి గది వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్‌ను కూడా 2023 జూలై 4న కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.12వ తరగతిలో 99 శాతం మార్కులు సాధించిన దిశా శర్మ తెలివైన అమ్మాయి. డాక్టర్ కావాలన్నది ఆమె కల.