Tamil Nadu minister Senthil Balaji: తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీకి బుధవారం ఉదయం కావేరి ఆసుపత్రిలో హార్ట్ కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ తర్వాత మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
అతను ప్రస్తుతం స్థిరంగా ఉన్నారు. శస్త్రచికిత్స అనంతర కార్డియోథొరాసిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వైద్యులు మరియు నర్సుల మల్టీడిసిప్లినరీ బృందం ద్వారా పర్యవేక్షించబడుతున్నారని ఆసుపత్రి పేర్కొంది.బాలాజీ హెల్త్ అప్‌డేట్‌ల గురించి తెలుసుకోవడానికి తాను వైద్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు. నేను నిరంతరం వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నాను. డాక్టర్ రఘురామన్ సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ చేసారు. ఇప్పుడు బైపాస్ సర్జరీ ఆపరేషన్ పూర్తయింది. సెంథిల్ బాలాజీ పోస్ట్ ఆపరేషన్ వార్డులో ఉన్నారని ఆయన అన్నారు. 47 సంవత్సరాల బాలాజీ జూన్ 14న కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకున్నారు. అనంతరం వైద్యులు బైపాస్ సర్జరీని సిఫార్సు చేసారు.
మంత్రి బాలాజీని జూన్ 14న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన తరువాత ఛాతీ నొప్పి రావడంతో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. జూన్ 15న మద్రాసు హైకోర్టు అతడిని తనకు నచ్చిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతించింది. అనంతరం తమిళనాడు ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రికి తరలించారు.