Site icon Prime9

Tamilnadu First Women Bus Driver: ఎంపీ అభినందించినందుకు ఉద్యోగం పోగొట్టుకున్న మహిళా బస్సు డ్రైవర్

Tamilnadu First Women Bus Driver

Tamilnadu First Women Bus Driver

Tamilnadu First Women Bus Driver: తమిళనాడులో మొదటి మహిళా బస్సు డ్రైవర్ గా పేరొందిని షర్మిలకు ఆ యాజమాన్యం షాక్ ఇచ్చింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి షర్మిలను అభినందించిన కొద్ది గంటలకే ఆ మహిళా బస్సు డ్రైవర్ పై యాజమాన్యం వేటు వేసింది.

అసలు ఏం జరిగిందంటే(Tamilnadu First Women Bus Driver)

ప్రైవేట్‌ సంస్థకు చెందిన బస్సులో డీఎంకే ఎంపీ కనిమొళి కోయంబత్తూరు వెళ్లారు. ఈ సందర్భంగా కోయంబత్తూరులోని గాంధీపురం నుంచి సోమనూర్ మార్గంలో ఎంపీ వెళ్లాల్సి ఉండగా.. వడవల్లి షర్మిల అదే రూట్ లో డ్యూటీలో ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం 23 జూన్ 2023 ఎంపీ కనిమొళి షర్మిల నడిపే బస్సు ఎక్కారు. గాంధీపురం బస్టాండ్ లో షర్మిల బస్సు ఎక్కిన ఎంపీ కనిమొళి పీలబేడుకు బయలుదేరారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మొదటి బస్సు డ్రైవర్ గా నిలిచిన షర్మిలను కనిమొళి అభినందించారు. ఆమెకు వాచీని బహుమతిగా ఇచ్చారు.

అయితే అదే సందర్భంలో అదే బస్సులో కండక్టర్ గా పనిచేస్తున్న ట్రైనీ కండక్టర్ అన్నాతై కనిమొళిని మరియు ఆమె వెంటన వచ్చినవారి టికెట్ అడిగారు. దానికి షర్మిల ఎంపీ ఉచిత ప్రయాణం.. టికెట్ తీసుకోవద్దు అని చెప్పారు. కానీ అప్పటికే తాను టికెట్ తీసుకున్నానని కనిమొళి చెప్పారు. ఈ తరుణంలో డ్రైవర్ షర్మిలకు.. కండక్టర్ అన్నాతైకు మధ్య చిన్నపాటివాగ్వాదం చోటుచేసుకుంది. దీనితో కండక్టర్ డ్రైవర్ షర్మిలపై కంప్లైంట్ చేసింది.

దీనితో సదరు బస్సు యజమాన్యం షర్మిలను పిలిచి చీవాట్లు పెట్టింది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని తెలిపింది. దీనితో షర్మిల షాక్ అయ్యాంది. ‘‘నేనేం తప్పుచేశానని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. దానికి యాజమాన్యం నీ పాపులారిటీ కోసం తరచు బస్సులో ప్రయాణించేందుకు సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తున్నావంటూ అనింది. తాను అటువంటిదేమీ చేయలేదని షర్మిల చెప్పినా కానీ యాజమాన్యం వినిపించుకోలేదు. దానితో చేసేదేమి లేక ఆ మహిళాడ్రైవర్ వెనుదిరిగి వచ్చేసింది. అలా అధికార పార్టీ మహిళా ఎంపీ ఓ మహిళా డ్రైవర్ ను అభినందించినందుకు ఆమె ఉద్యోగం పోయిందని కొందరు అంటున్నారు.

Exit mobile version