Site icon Prime9

Blades in Stomach: చనిపోవాలని 56షేవింగ్ బ్లేడ్లను మింగాడు.. కానీ చివరికి?

BLADES

BLADES

Blades in Stomach: ఓ యువకుడు చనిపోవాలని 56 షేవింగ్ బ్లేడ్లను మింగిన ఘటన.. రాజస్థాన్ లో చోటు చేసుకుంది. అదృష్టం బాగుండి ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కడుపులో అన్ని బ్లేడ్లను చూసి.. వైద్యులు షాక్ అయ్యారు.

కడుపులో బ్లేడ్లు.. (Blades in Stomach)

రాజస్థాన్‌లోని జలోర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చనిపోదామని 24 ఏళ్ల యువకుడు ఏకంగా 56 బ్లేడ్లను మింగాడు. యువకుడికి కడుపునొప్పి రావడంతో.. ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కడుపులో అన్ని బ్లేడ్లు ఉండటం చూసి షాకయ్యారు. యశ్‌పాల్‌ అనే యువకుడు సంచార్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉద్యోగ సమస్యల కారణంగా డిప్రెషన్‌లో ఉన్నాడు. దీంతో ఎలాగైన చనిపోవాలని.. నిర్ణయించుకుని బ్లేడ్ ముక్కలను మింగాడు. వెంటనే రక్తపు వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రిలో చేర్పించారు. కడుపు ఎక్స్-రే తీసిన వైద్యులకు కళ్లు బైర్లు కమ్మాయి. ఆ తర్వాత ఆపరేషన్ చేసి 56 షేవింగ్ బ్లేడ్ ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి అతని కడుపులో నుంచి తొలగించారు.

మెరుగ్గా యువకుడి పరిస్థితి

ప్రస్తుతం బాధిత యువకుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతని శరీరంలో కొంత భాగం దెబ్బతిందని వైద్యులు తెలిపారు. అవయవాలు అంతర్గతంగా దెబ్బతినడంతో మందులు ఇస్తున్నారు. యశ్‌పాల్ సింగ్ ఓ ప్రైవేటు సంస్థలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. మరో నలుగురు స్నేహితులతో కలిసి బాలాజీ నగర్‌లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం మిత్రులందరూ విధులు వెళ్లిపోవడంతో యశ్‌పాల్ ఒక్కడే గదిలో మిగిలాడు. ఆ తర్వాత గంట సేపటికే యశ్‌పాల్‌కు రక్తపు వాంతులు అయ్యాయి. దీంతో భయపడిపోయి మిత్రులకు ఫోన్ చేశారు. వెంటనే వారొచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడతడికి పరీక్షలు చేసి స్కానింగ్ చేసిన వైద్యులు పొట్టలో కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంత పోయారు.

Exit mobile version
Skip to toolbar