Site icon Prime9

Lady Kim of Bengal: లేడీ కిమ్ గా మమతా బెనర్జీ.. బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి

BJP-leader-Suvendu-Adhikari

West Bengal: పశ్చిమబెంగాల్ లో బీజేపీ నవన్న ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించకముందే ప్రతిపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ, రాహుల్ సిన్హాలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనితో పోలీసులతో సువేందు వాగ్వాదానికి దిగారు

తనపై మహిళా పోలీసులు ఎందుకు చేయి చేసుకుంటున్నారని సువేందు ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్‌ అధికారిని పిలిపించాలని డిమాండ్‌ చేశారు. సౌత్ కోల్ కతా డిప్యూటీ కమిషనర్ ఆకాష్ మఘరియా వచ్చారు. సువేందు అతనితో ఇక్కడి మహిళాపోలీసులంతా నన్ను ముట్టుకుంటున్నారు. నేను నీపై కోర్టుకు వెళ్తాను” అన్నారు. దీనికి మఘరియా బదులిస్తూ, “సార్, మా డిపార్టుమెంట్లో స్త్రీ, పురుషుల విభజన లేదని పేర్కొన్నారు.

మమతా బెనర్జీ భయపడుతున్నారని, అందుకే ఆమె బీజేపీని అడ్డుకుంటున్నారని లాకెట్ ఆరోపించారు. “నన్ను ఎందుకు ఆపుతున్నారు? నన్ను వెళ్లనివ్వండి. అనాగరికతకు హద్దులు ఉన్నాయి మేదినీపూర్‌లో ఉన్న లేడీ కిమ్ (మమతా బెనర్జీ) కి ఇది భారతదేశం అని చెప్పండి. కానీ ఆమె బెంగాల్‌ను ఉత్తర కొరియాగా మార్చింది” అని సువేందు ఆరోపించారు. ఆ తర్వాత సువెందు, లాకెట్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిద్దరినీ వేర్వేరు జైలు వ్యాన్లలో ఉంచి లాల్ బజార్ (కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్) కి తీసుకెళ్లారు.

Exit mobile version