Site icon Prime9

AIADMK: ఎఐఎడిఎంకె తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నికను సమర్దించిన సుప్రీంకోర్టు

AIADMK

AIADMK

AIADMK:  అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) కొనసాగేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. ఓపీఎస్, ఈపీఎస్ మధ్య వివాదానికి సంబంధించి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుపై ఈ ఉత్తర్వు ఎలాంటి ప్రభావం చూపదని సుప్రీంకోర్టు పేర్కొంది.

పనీర్ సెల్వంను బహిష్కరించిన కార్యనిర్వాహక మండలి..(AIADMK)

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పార్టీ నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పనీర్‌సెల్వం (ఓపీఎస్‌) పిటిషన్‌ దాఖలు చేశారు. సెప్టెంబరు 2, 2022న ఇచ్చిన హైకోర్టు తీర్పుపై ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇప్పుడు కొట్టివేసింది.అయితే, జూలై 11, 2022న అన్నాడీఎంకే సాధారణ సమావేశంలో ఆ పార్టీ కార్యనిర్వాహక మండలి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని నియమించి, “పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు” పనీర్ సెల్వంను బహిష్కరించింది.సెప్టెంబర్‌ 2న మద్రాస్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ధృవీకరించిందనిఈపీఎస్‌ తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్‌ తెలిపారు.

పళనిస్వామి నియంతగా వ్యవహరించాడు..

పళనిస్వామి ఒక  నియంతగా ఉన్నాడని ,2017లో తనకు ‘డమ్మీ’ ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారని పనీర్ సెల్వం ఆరోపించారు..2017-2021లో పళనిస్వామి అన్ని అధికారాలను కలిగి ఉన్నాడు. అయితే నిరంకుశంగా వ్యవహరించాడు. ఇది 2019 లోక్‌సభ, పౌర ఎన్నికలు మరియు 2021 అసెంబ్లీ ఎన్నికలతో సహా అన్నాడీఎంకేకు ఎన్నికల పరాజయాలను పునరావృతం చేయడానికి దారితీసిందని పన్నీర్‌సెల్వం చెప్పారు.

ఈరోడ్ ఉపఎన్నికలో పనీర్ సెల్వం మద్దతు కోరిన బీజేపీ..

ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ఫిబ్రవరి 27న జరగనున్న ఉప ఎన్నికకు తమ నిర్ణయానికి మద్దతివ్వాలని బీజేపీ ఓ పన్నీర్‌సెల్వం వర్గాన్ని కోరింది.ఉప ఎన్నిక మరియు పొత్తుకు సంబంధించితమిళనాడు బిజెపి రాష్ట్ర చీఫ్ కె అన్నామలై తమ వైఖరిని స్పష్టం చేసారు.ఎన్నికలను ఒకే బలమైన శక్తిగా ఎదుర్కోవాలని మరియు డిఎంకె-మద్దతుగల కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని ఎఐఎడిఎంకె నాయకులిద్దరికీ పార్టీ విజ్ఞప్తి చేసారు.పళనిస్వామి అభ్యర్థి (కెఎస్‌ తెన్నరసు, మాజీ ఎమ్మెల్యే)కి మద్దతివ్వాలని, అన్నాడీఎంకే ‘రెండు ఆకుల’ గుర్తును నిలుపుకుని పోటీ చేసేందుకు కలిసి పనిచేయాలని పన్నీర్‌సెల్వంను కోరామని అన్నామలై చెప్పారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తమ పార్టీ జోక్యం చేసుకుంటోందని విమర్శలపై ఆయన వివరణ ఇచ్చారు

డీఎంకే నేతృత్వంలోని కూటమిని ఓడించేందుకు బీజేపీ తన మిత్రపక్షం ఐక్యంగా ఉండాలని, బలంగా ఉండాలని కోరుకుంటోందని అన్నారు.మా మిత్రపక్షం బలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము… ఒకరి బలహీనతను పణంగా పెట్టి ఎదగాలని మేము కోరుకోము” అని అన్నామలై అన్నారు.తమకుమద్దతిస్తానని పన్నీర్‌సెల్వం సూచించినప్పటికీ కొన్ని షరతులు పెట్టారని, వాటిని బయటపెట్టకుండానే చెప్పారు. రెండు వర్గాలు విభేదాలను త్వరలోనే సర్దుకుంటాయని ఆశిస్తున్నాను అని అన్నామలై అన్నారు.

Exit mobile version