Gyanvapi Masjid: తదుపరి విచారణ జరిపేవరకు జ్ఞాన్‌వాపి మసీదు-కాశీ విశ్వనాథ్ కారిడార్‌లోని శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించరాదని సుప్రీంకోర్టు శుక్రవారం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి తెలిపింది.2022లో వీడియోగ్రాఫిక్ సర్వేలో వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో కనుగొనబడిన ‘శివలింగం’ వివాదాస్పద కట్టడం. నిర్మాణంపై కార్బన్ డేటింగ్‌ను అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు వాయిదా వేసింది.
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల స్పందన అడిగిన కోర్టు..( Gyanvapi Masjid)
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల స్పందనను కూడా కోర్టు కోరింది.యుపి ప్రభుత్వం తరపున వాదిస్తూ, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మేము కార్బన్ డేటింగ్‌కు బదులుగా మరికొన్ని శాస్త్రీయ పరీక్షలు చేయాలా వద్దా అని కూడా కనుగొనాలని అన్నారు.
దీనిపై సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ ఈ విషయాల్లో జాగ్రత్తగా నడుచుకోవాలని అన్నారు. ఆ నిర్మాణం శివలింగం లేదా ఫౌంటెన్ కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు శాస్త్రీయ విచారణకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ధర్మాసనం నిలుపుదల చేసింది.